Polala Amavasya: సోమవతి అమావాస్య రోజున మీ రాశి ప్రకారం ఈ వస్తువులు దానం చేయండి.. విశేష ఫలితాలు మీ సొంతం

|

Aug 29, 2024 | 6:43 PM

సోమవతి అమావాస్య రోజున స్నానం చేయడం, దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సోమవతి అమావాస్య రోజు దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి పూర్వీకులు సంతృప్తి చెందుతారని నమ్మకం. ఈ రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, పాపాలు నశించి మోక్షం కలుగుతుంది. ఈ రోజున దానం చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారుని ఆశీర్వదిస్తారని విశ్వాసం.

Polala Amavasya: సోమవతి అమావాస్య రోజున మీ రాశి ప్రకారం ఈ వస్తువులు దానం చేయండి.. విశేష ఫలితాలు మీ సొంతం
Polala Amavasya 2024
Image Credit source: Dinodia Photo/Corbis Documentary/Getty Images
Follow us on

హిందూ మతంలో అమావాస్య తిధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పోలాల అమావాస్య రోజున పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలను నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈసారి శ్రావణ మాసంలోని చివరి రోజు అమావాస్య సోమవారం, 2 సెప్టెంబర్ 2024న వస్తుంది. ఈ అమావాస్య సోమవారం వస్తుంది కనుక ఈ పొలాల అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు. అన్ని అమావాస్యలలో సోమవతి అమావాస్య చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సోమవతి అమావాస్య రోజున స్నానం, దానంతో పాటుగా పితృ తర్పణం కూడా చేస్తారు. ఈ రోజున పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధ కర్మ నిర్వహించడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. తమ వారిపై ఆశీర్వాదాలు కురుస్తాయని, ఫలితంగా వ్యక్తి సుఖం, శాంతి, శ్రేయస్సు పొందుతారని మత విశ్వాసం. సంతానం ఆయుస్సు పెరుగుతుంది. కనుక ఈ రోజున పూర్వీకుల సంతృప్తి, మోక్షం కోసం తర్పణం, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.

సోమవతి అమావాస్య రోజున చేసే దానానికి ప్రాముఖ్యత

సోమవతి అమావాస్య రోజున స్నానం చేయడం, దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సోమవతి అమావాస్య రోజు దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి పూర్వీకులు సంతృప్తి చెందుతారని నమ్మకం. ఈ రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, పాపాలు నశించి మోక్షం కలుగుతుంది. ఈ రోజున దానం చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారుని ఆశీర్వదిస్తారని విశ్వాసం. అలాగే ఈ రోజు దానం చేయడం ద్వారా కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున వ్యక్తులు తమ రాశుల ప్రకారం కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. ఈ రోజు పొలాల అమావాస్య రోజున రాశి ప్రకారం ఏ రకమైన దానం చేయాలో తెలుసుకుందాం..

సోమవతి అమావాస్య రోజున మీ రాశి ప్రకారం ఈ వస్తువులు దానం చేయండి

  1. మేషరాశి: పోలాల అమావాస్య లేదా సోమవతి అమావాస్య రోజున మేష రాశి వారు బెల్లం, గోధుమలు, ఆహార పదార్థాలను దానం చేయాలి.
  2. వృషభ రాశి: వృషభ రాశి వారు నెయ్యి, నువ్వులు, వెండితో చేసిన వస్తువులను దానం చేయాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. మిధున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు సోమవతి అమావాస్య తిధి రోజున పచ్చి శెనగలు దానం చేయాలి.
  5. కర్కాటక రాశి: కర్కాటక రాశి ఉన్నవారు ముత్యాలు, తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయాలి.
  6. సింహ రాశి: సోమవతి అమావాస్య నాడు సింహ రాశి వారు బంగారు ఆభరణాలు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఉత్తమం.
  7. కన్య రాశి: సోమవతి అమావాస్య నాడు కన్యా రాశి వారు నెయ్యి, నూనె, ఆహార ధాన్యాలు దానం చేయాలి.
  8. తులా రాశి: సోమవతి అమావాస్య రోజున తులారాశి వారు పాలు, నెయ్యి, బంగారు లోహంతో చేసిన వస్తువులను దానం చేయాలి.
  9. వృశ్చిక రాశి: సోమవతి అమావాస్య నాడు వృశ్చిక రాశి వారు ఆవు, పాలు, ఎరుపు రంగు బట్టలు దానం చేయాలి.
  10. ధనుస్సు రాశి: సోమవతి అమావాస్య నాడు ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు బంగారం, వెండి లోహంతో చేసిన ఆహారాన్ని, వస్తువులను దానం చేయాలి.
  11. మకరరాశి: మకర రాశికి చెందిన వ్యక్తులు సోమవతి అమావాస్య నాడు నవ ధాన్యాలను, గుర్రాన్ని దానం చేయాలి.
  12. కుంభ రాశి: కుంభ రాశి వారు సోమవతి అమావాస్య రోజున నెయ్యి దానం చేయాలి.
  13. మీనరాశి: సోమవతి అమావాస్య నాడు మీన రాశి వారు నెయ్యి, ఏదైనా బంగారు వస్తువు, ఎద్దును దానం చేయాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు