Zodiac Signs: అక్రమ సంపాదనపై పెరగనున్న తపన.. ఈ అయిదు రాశులకు పాపాధి యోగం!

| Edited By: Janardhan Veluru

Jun 20, 2024 | 5:29 PM

జాతకంలో చంద్రుడున్న రాశికి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో గురు, శుక్ర, బుధులు ఉన్నప్పుడు శుభాధి యోగం, రవి, కుజ, శని, రాహువులున్నప్పుడు పాపాధి యోగం పడతాయి. శుభాధియోగం వల్ల సక్రమ మార్గాల్లోనూ, పాపాధి యోగం వల్ల అక్రమ మార్గాల్లోనూ సంపాదించే అవకాశం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇదంతా వ్యక్తిగత జాతకాల మీద కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

Zodiac Signs: అక్రమ సంపాదనపై పెరగనున్న తపన.. ఈ అయిదు రాశులకు పాపాధి యోగం!
Papadi Yoga
Follow us on

జాతకంలో చంద్రుడున్న రాశికి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో గురు, శుక్ర, బుధులు ఉన్నప్పుడు శుభాధి యోగం, రవి, కుజ, శని, రాహువులున్నప్పుడు పాపాధి యోగం పడతాయి. శుభాధియోగం వల్ల సక్రమ మార్గాల్లోనూ, పాపాధి యోగం వల్ల అక్రమ మార్గాల్లోనూ సంపాదించే అవకాశం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇదంతా వ్యక్తిగత జాతకాల మీద కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఈ పాపాధి యోగం ఏర్పడింది. దీనివల్ల ఈ రాశుల వారికి ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తపన పెరుగుతుంది. కొద్దిగానైనా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశుల వారికి సుమారు నెల రోజుల పాటు ఈ పాపాధి యోగం వర్తిస్తుంది. ఏయే రాశుల వారికి ఇది ఎలా వర్తిస్తుందో పరిశీలిద్దాం.

  1. కర్కాటకం: ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పాపాధి యోగం ఏర్పడింది. సామా జి కంగా తక్కువ స్థితిలో ఉన్నవారు, పేదలు, తమ కింద పనిచేసే ఉద్యోగులు, అవినీతిపరుల ద్వారా ఈ రాశివారు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, శని స్వస్థానంలో ఉన్నందువల్ల అవినీతి కార్యకలాపాల ద్వారా మాత్రమే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా వడ్డీ వ్యాపారాలు, జూదాల ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడడం జరుగుతుంది.
  2. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శని, అష్టమంలో రాహువు సంచారం వల్ల జీతభత్యాల కంటే అదనపు రాబడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారు బాగా రాణించే అవకాశం ఉంటుంది. అధికారులు దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. అనవసర పరిచయాలు పెరుగుతాయి. ఏదో విధంగా ధనం సంపాదించడమే ప్రధానం అయిపోతుంది. శని స్వస్థానంలో ఉన్నందువల్ల ఎక్కువగా వడ్డీ వ్యాపారాల ద్వారా సంపాదించే అవకాశం ఉంటుంది.
  3. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో శనీశ్వరుడు, ఏడవ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల పూర్తి స్థాయిలో పాపాధి యోగం ఏర్పడింది. దీనివల్ల అనవసర పరిచయాల ద్వారా కూడా లబ్ది పొందే అవకాశం ఉంటుంది. బలహీనవర్గాల మీద ఆధిపత్యం చెలాయించడం జరుగు తుంది. రాజకీయ నాయకులు, జైళ్ల అధికారులు, పోలీసులకు ఇది యోగదాయకంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం ద్వారా అత్యధికంగా సంపాదించడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
  4. తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో కుజు గ్రహ సంచారం వల్ల పాపాధి యోగం ఏర్పడింది. అతి తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు పొందడం, కమిషన్లు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల వారికి ఈ యోగం బాగా అనుకూలంగా ఉంటుంది. వీరు ఎక్కువగా శ్రమను దోచుకోవడం జరుగుతుంది. మద్యం, ఫైనాన్స్ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వచ్చే అవ కాశం ఉంది. మధ్యవర్తిత్వాలు, సెటిల్మెంట్లు వంటి కార్యకలాపాల ద్వారా వీరు లబ్ధి పొందుతారు.
  5. వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కుజ గ్రహ సంచారం వల్ల ఏదో విధంగా ధనవంతులు కావాలనే తపన పెరుగుతుంది. జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కోసం ప్రయత్నించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా వడ్డీ వ్యాపా రాలు, రాజకీయాలు, మద్యం, రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా వీరి సంపాదన పెరుగుతుంది. దళా రులు, బ్రోకరేజ్, సెటిల్మెంట్లు వంటి వాటి ద్వారా కూడా ఈ రాశివారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.