Horoscope Today: క్యాలెండర్‌లో మరో కొత్త వారం మొదలైంది. మరి ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారా.? అయితే రాశి ఫలం ఆధారంగా మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఏమేర రాణిస్తాయో.. చూసుకొని ఈ కొత్త వారాన్ని ప్రారంభించండి. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి.
మేష రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి. గృహ సంబంధిత విందు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. దుర్గా ఆరాధణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
ఈ రాశి వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం అప్పులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసి రాకపోవచ్చు.. ఓం శరవనభవ అనే నామ స్మరణ మేలు చేస్తుంది.
ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులు, బంధువుల నుంచి కొన్ని రకాల ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. ఆధ్యాత్మిక చింతన మిమ్మల్ని కాపాడుతుంటుంది. శంక పుష్పాలతో పరమేశ్వరుడికి అర్చన చేయడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
కర్కారట రాశి వారికి ఆర్థిక అభివృద్ధి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా విషయాల్లో మంచి సహకారాలు పొందుంటారు. ఓం గం గణపతయే నమః నామ స్మరణ ఈ రాశి వారికి మేలుచేస్తుంది.
ఈ రాశి వారు ఈరోజు సౌకర్యాల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహన సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నందీశ్వరుడి పూజ ఈరాశి వారికి సూచించదగ్గ అంశం.
కన్య రాశి వారు ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో అదనపు బాధ్యతలు స్వీకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ నారాయణ పూజ మేలు చేస్తుంది.
ఈ రాశి వారి ఈ రోజు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓం మహా దేవీ నమః అనే నామ స్మరణ ఈ రాశి వారికి సూచంచదగ్గ అంశం.
వృశ్చిక రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొవడానికి బంధువులు సహకారం చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
ఈ రాశి వారికి పనులు పూర్తి చేసే విషయంలో శ్రమ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సంబంధిత స్తోత్ర పారాయణం వీరికి సూచించదగ్గ అంశం.
మకర రాశివారి ఈరోజు వ్యక్తిగత అంశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువులను కలుసుకునే అవకాశాలున్నాయి. రాజరాశేశ్వరి అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అనారోగ్య సంబంధమైన భావనలు చోటుచేసుకుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గ సప్త శ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి వారికి వ్యక్తిగత ఆస్తి విషయాలు పరిష్కారం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. పలు శుభకార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకోగలుగుతారు. గరికతో మహాగణపతిని అర్చన చేసుకోవడం మంచిది.
Also Read: Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..
Airtel offer: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 5.5 కోట్ల మంది కస్టమర్లకు రీచార్జ్ ఉచితం.. వివరాలు..