Monthly Horoscope For April 2023
Image Credit source: TV9 Telugu
April 2023 Horoscope: తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మాసఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలలో గురువు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ రాశిలో కలుస్తున్నందువల్ల చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అనుకోని అదృష్టం ఆదాయ రూపంలో పడుతుంది. ఆదాయం పెరగటం, కానీ కొత్తగా మరొక ఆదాయ మార్గం మీ ముందుకు రావటం కానీ జరుగు తుంది. ఎవరికైనా వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం చేయని పక్షంలో ఈ నెల అంతా ఈ రాశి వారికి వైభవంగా గడిచిపోతుం దనే చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా మంచి ప్రమోషన్ రావటం ఇంక్రిమెంట్ పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మంచి కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. కుటుంబ వాతావరణం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. అయితే, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ నెలలో 12వ రాశిలో అంటే వ్యయ స్థానంలో నాలుగు గ్రహాలు చేరటం వల్ల శుభకార్యాల మీద లేదా పుణ్య కార్యాల మీద విపరీతంగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించని పక్షంలో వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగాలు రావడం లేదా విదేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్ళవలసి రావటం వంటివి చోటు చేసు కుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. బంధు వర్గంలో అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదిరి సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. షేర్లు స్పెక్యులేషన్ ల జోలికి పోవద్దు. అనవసర పరిచయాలకు పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ నెల 4 గ్రహాలు లాభ స్థానంలో కలవడం అన్నది గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు అప్రయత్నంగానే చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. బంధుమిత్రుల నుంచి, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సమస్యలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా సమసి పోతాయి. వృత్తి వ్యాపారాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. స్నేహితులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. దూరప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. పిల్లల కారణంగా ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ నెల దశమ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల ఉద్యోగ పరంగా కొన్ని శుభ పరిణామాలు, మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా ఒకటి రెండు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. చాలాకారంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ ఇప్పుడు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. వృత్తి వ్యాపారాలు అతివేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇతరులకు మీరే ఉద్యోగాలు కల్పించే స్థితికి చేరుకోవడానికి కూడా అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే సూచనలు ఉన్నాయి. కొందరు బంధువులు అపనిందలు వేయటం గానీ, దుష్ప్రచారం చేయటం కానీ జరగవచ్చు. దొంగలు లేదా మోసగాళ్ల వల్ల డబ్బు నష్టపోయి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశి వారికి ఈ నెల నాలుగు గ్రహాలు 9వ స్థానంలో అంటే భాగ్య స్థానంలో కలవటం అనేది మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. విదేశాలలో చదువులు, ఉద్యోగం, స్థిరత్వం వంటివి సానుకూల పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి కంపెనీల నుంచి అనేక ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి చెందుతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చాలాకాలంగా వేధిస్తున్న లేక పీడిస్తున్న ఆర్థిక సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. ఆస్తి సంబంధమైన కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులు ఒడ్డున పడతారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశి వారికి అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవు తాయి. నిరుద్యోగులకు నిరీక్షణ కాలం కొద్దిగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారటానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బంధు మిత్రులతో అపార్ధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయం లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం వంటివి పెట్టు కోవద్దు. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలు కూడా వాయిదా వేయడం శ్రేయస్కరం. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సప్తమ స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో చేరటం వల్ల ఈ రాశి వారికి ఈ నెల అంతా వైభవంగా జరిగిపోయే అవకాశం ఉంది. సమా జంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యో గంలో మంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు, అభిప్రాయ భేదాలు పరిష్కారం అవుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటి రంగం వారు క్షణం తీరిక లేకుండా బిజీ అయిపోతారు. యాక్టివిటీ పెరిగిపోతుంది. ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు కూడా ఎక్కువ సంఖ్యలో మీ ముందుకు వస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అయితే, అనవసర పరిచయాలకు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండటం ప్రస్తుత పరిస్థితులలో చాలా మంచిది. మిమ్మల్ని పక్కదారి పట్టించే స్నేహితులు కొందరు పక్కన చేరతారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆరవ స్థానంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు చేరటం అనేది అంతగా మంచిది కాదు. కొన్ని ప్రతికూల ఫలితాలను తప్పనిసరిగా అనుభవిం చాల్సి వస్తుంది. ఉద్యోగ పరంగా ఇది గొప్ప అదృ ష్టాన్ని కలుగజేస్తుంది. మంచి గుర్తింపు లభి స్తుంది. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. అయితే, వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువవు తుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. ముఖ్య మైన పనుల్లో తిప్పట ఒత్తిడి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు. కుటుంబంలో మనశ్శాంతి తగ్గుతుంది. ఒక నెల రోజులపాటు అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. హామీలు కూడా ఉండవద్దు. బాగా దగ్గర వారు డబ్బు విషయంలో మోసగించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగాలలో చేరవలసి వస్తుంది. ఆహార విహారాల్లో కఠిన నియమాలు పాటించడం మంచిది. ప్రతి ఉదయం లలితా సహస్రనామం పఠించడం వల్ల చెడు ఫలితాలు తగ్గి మనశ్శాంతి ఏర్పడుతుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశి వారికి ఈ నెల అంతా ఐదవ స్థానంలో ఎక్కువ సంఖ్యలో గ్రహ సంచారం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి జీవితంలో ఎన్నడూ ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీరు ఈ నెల అంతా ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంత మంచిది. అనవసర విషయాలపై కాలం వృధా చేయకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటే సమయం సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు ఎటువంటి మంచి నిర్ణయం తీసుకున్నా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. తోబుట్టువులతో, బంధువులతో విభేదాలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అయితే శత్రువులెవరో, మిత్రులు ఎవరో తెలుసుకొని వ్యవహరించండి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారికి నెలరోజుల పాటు నాలుగో స్థానంలో నాలుగు గ్రహాలు సంచరించడం వల్ల జీవితం తప్పకుండా ఒక గొప్ప మలుపు తిరిగే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఒక మంచి సంస్థలో అధికారం చేపట్టే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆదరణ, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావటమే కాకుండా మనసులోని ఒకటి రెండు కోరికలు అప్రయత్నంగా నెరవేరటం జరుగుతుంది. చాలామందికి ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ సహాయం చేయడం, ఆదుకోవటం వంటివి జరుగుతాయి. రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. వెన్నుపోటు పొడిచే వారుంటారు. పిల్లలు పురోగతి చెందుతారు. దాంపత్య జీవితంలో అపార్ధాలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి మూడవ రాశిలో అధిక సంఖ్యలో గ్రహాలు చేరడం అనేది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వినోదయాత్రకు వెళతారు. ఈ నెల అంతా కుటుంబ ప్రయోజనా లకు ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగరీత్యా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరక నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. దూర ప్రాంతంలో ఉన్న పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత జీవితం రొటీన్ గా ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. శివార్చన చేయించడం వల్ల పరిస్థితుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి వారికి ధనస్థానంలో నాలుగు శుభ గ్రహాలు చేరటం ఆర్థికపరంగా చాలా మంచిది. ఆదాయం, సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి తప్పకుండా బయటపడటం జరుగుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు వంటివి అనూ హ్యమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. మీ మాటకు సర్వత్రా విలువ పెరుగుతుంది. అధికారులు మీ సలహాలకు సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఇతరుల వాద వివాదాల్లో తలదూర్చకపోవడం శ్రేయస్కరం.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)