Money Astrology: గురు, కుజుల కలయిక.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

| Edited By: Janardhan Veluru

Jul 29, 2024 | 6:53 PM

ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురు, కుజులిద్దరూ ఒకే నక్షత్రంలో, ఒకే డిగ్రీలో కలిసి ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి ఆర్థిక కష్టనష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు ధనానికి సంబంధించిన గ్రహాలే అవడం, పైగా సహజ ధన స్థానమైన వృషభ రాశిలో ఒకే డిగ్రీలో కలిసి ఉండడం వల్ల తప్పకుండా ధన యోగాలు పట్టడం జరుగుతుంది.

Money Astrology: గురు, కుజుల కలయిక.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Money Astrology
Follow us on

ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురు, కుజులిద్దరూ ఒకే నక్షత్రంలో, ఒకే డిగ్రీలో కలిసి ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి ఆర్థిక కష్టనష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు ధనానికి సంబంధించిన గ్రహాలే అవడం, పైగా సహజ ధన స్థానమైన వృషభ రాశిలో ఒకే డిగ్రీలో కలిసి ఉండడం వల్ల తప్పకుండా ధన యోగాలు పట్టడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. ఈ పరిస్థితి ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడు, భాగ్యాధిపతి గురువు రోహిణి నక్షత్రంలో బాగా సన్నిహితం కావడం వల్ల అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. విలువైన ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరగడంతో పాటు లాభాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సంబంధమైన కష్ట నష్టాల నుంచి పూర్తిగా బయటపడతారు.
  2. వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజ, గురువులు ఒకే డిగ్రీలో కలిసినందువల్ల, ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఆస్తి వివాదం పరి ష్కారమవుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కడం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో, రాశ్యధిపతి చంద్రుడికి చెందిన రోహిణి నక్షత్రంలో కుజ, గురువులు కల వడం వల్ల దాదాపు ప్రతి ఆదాయ ప్రయత్నమూ అంచనాలకు మించి సత్ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావ లసిన డబ్బు, బాకీలు, బకాయిలు పూర్తిగా వసూలవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ, గురువుల మధ్య సాన్నిహిత్యం పెరిగినందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఆదాయానికి లోటుండనందు వల్ల దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా చాలావరకు విముక్తి లభించే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం వీరు రుణ విముక్తులయ్యే అవకాశం కూడా ఉంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి కూడా ఆదాయం ఆశించినంతగా పెరగడం జరుగుతుంది.
  5. వృశ్చికం: సప్తమంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి కుజుడికి ధన స్థానాధిపతి గురువు బాగా సన్నిహితం అయినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. భూసంబంధమైన ఆస్తి కలిసి వస్తుంది. భూమి క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. రుణ సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడడం జరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
  6. మకరం: ఈ రాశికి పంచమ కోణంలో కుజ, గురువులు రోహిణి నక్షత్రంలో కలిసినందువల్ల, ఉద్యోగంలో హోదా పెరగడం, దాంతో పాటే జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని సంపాదించడం, ఖర్చు చేయడం వంటి వాటివల్ల బ్యాంకు రుణాలు, గృహ రుణాలు వంటివి కూడా బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించు కోవడం, పొదుపు పాటించడం వంటి చర్యల వల్ల ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.