Women Astrology: సింహరాశిలోకి శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!

శుక్రుడు స్త్రీ గ్రహమైనందువల్ల ఈ గ్రహం ఎప్పుడు, ఏ రాశిలోకి మారినా మహిళల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు గ్రహ రాజైన రవి అధిపతిగా ఉన్న సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మహిళలకు అత్యధికంగా యోగాలివ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా అధికారం చేపట్టడం జరుగుతుంది.

Women Astrology: సింహరాశిలోకి శుక్రుడు.. ఆ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
women astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 28, 2024 | 7:31 PM

శుక్రుడు స్త్రీ గ్రహమైనందువల్ల ఈ గ్రహం ఎప్పుడు, ఏ రాశిలోకి మారినా మహిళల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు గ్రహ రాజైన రవి అధిపతిగా ఉన్న సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మహిళలకు అత్యధికంగా యోగాలివ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా అధికారం చేపట్టడం జరుగుతుంది. శుక్రుడి అనుకూలత వల్ల జీవిత భాగస్వాములకు కూడా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత శుక్ర సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి ఆర్థిక, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆగస్టు 24వ తేదీ వరకు శుక్ర సంచార ఫలితాలు అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల మహిళా నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. తల్లి తండ్రుల నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.
  2. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు సింహ రాశిలో ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంతో పాటు, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి సానుకూల స్పందన లభిస్తుంది. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు సంపద లేదా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యానికి లోటుండదు.
  4. సింహం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మహిళలకు తప్పకుండా అధికార యోగం పడు తుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. ఉద్యోగ రీత్యా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం తప్పకుండా లభిస్తుంది.
  5. తుల: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, భారీ జీతభత్యాలకు అవకాశం ఉంది. నిరుద్యో గులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయా ణాలు, దూర ప్రాంత ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయ లుగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
  6. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి మహిళలకు ఉద్యోగంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితం కూడా నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవన శైలిలో మార్పు వస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
విజయ్‌ దేవరకొండ సినిమాను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన రష్మిక.!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!
తాగిన మైకంలో పాముతో ఆటలు.. కాటేసిన సర్పం.! తర్వాత ఏమైందంటే..!