Money Astrology
వ్యయ స్థానంలో బలమైన గ్రహాలు సంచరిస్తున్న కారణంగా ఆరు రాశుల వారి చేతుల్లో డబ్బు నిలిచే అవకాశాలు లేవు. ఈ రాశులుః మేషం, వృషభం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక ఖర్చు మీద పడడం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ రాశుల వారికి డబ్బుకు కటకట ఉండకపోవచ్చు కానీ, ఆదాయంలో ఎక్కువ భాగం ఏదో రకంగా ఖర్చయిపోవడం గానీ, పొదుపు చేయలేకపోవడం గానీ, బ్యాంకు బ్యాలెన్స్ తగ్గిపోవడం గానీ జరుగుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి వినాయకుడికి తరచూ అర్చన చేయడమో, వినాయకుడి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయడమో అలవాటు చేసుకోవడం మంచిది. దాదాపు జనవరి 17 వరకు ఇటువంటి కొన్ని అవసర ఖర్చులు, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు.
- మేషం: ఈ రాశివారు ఎక్కువగా విలాస జీవితం మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉన్నందువల్ల ఖర్చుకు వెనుకాడే అవకాశం లేదు. అయితే, కొందరు బాగా ఖర్చు చేయించడం లేదా డబ్బు నష్టం కలిగించడం వంటివి జరిగే సూచనలున్నాయి. ఖర్చులతో పాటు సాధారణంగా మోసపోవడం కూడా ఎక్కువగానే జరుగుతుంటుంది. మొత్తం మీద కష్టార్జి తంలో ఎక్కువ భాగం దుర్వ్యయం జరుగుతుంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది.
- వృషభం: వ్యయస్థానంలో ఉన్న గురువు (ధన కారకుడు) వల్ల ఈ రాశివారికి నాలుగైదు నెలల పాటు చేతిలో డబ్బు నిలవ ఉండే అవకాశం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చయిపోతుంటుంది. ఈ రాశివారు ఎటువంటి ఆర్థిక వ్యవహారాలనూ పెట్టుకోకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలను కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అప్పగించడం శ్రేయస్కరం. శుభ కార్యాలు లేదా దైవ కార్యాల మీద కూడా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అప్పులివ్వడం, సహాయం చేయడం కూడా ఇబ్బంది పెడుతుంది.
- తుల: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉన్న కేతువు చేతిలో డబ్బు ఉంచడు. అనవసర ఖర్చులు పెరిగిపోవడం, ఇతరులకు భారీగా సహాయం చేయడం, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం వంటివి జరుగుతాయి. ఎంత అదుపు చేయాలనుకున్నా అందుకు అవకాశం ఉండదు. వైద్య ఖర్చులు కూడా ఇందుకు తోడయ్యే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యం కారణంగా కూడా చేతిలో డబ్బు నిలవకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను ఇతరులకు అప్పగించడం మంచిది.
- వృశ్చికం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల విలాసాల మీద, వ్యసనాల మీద, సుఖ సంతోషాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఆదాయంతో సమా నంగా ఖర్చులు పెరిగిపోతుంటాయి. నిగ్రహం, క్రమశిక్షణ ఉంటే తప్ప చేతిలో డబ్బు నిలవ ఉండే అవకాశం లేదు. విహార యాత్రల మీద కూడా బాగా ఖర్చయ్యే సూచనలున్నాయి. అనవసర పరిచయాల వల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆభరణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి వ్యయ స్థానంలో కుజ, రవుల సంచారం జరుగుతున్నందువల్ల కొద్దిగా వైద్య సంబంధమైన ఖర్చులు తప్పనప్పటికీ, ఎక్కువగా తప్పనిసరి విషయాల మీదే ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. నిర్బంధంగా మదుపు చేయడం, పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం వంటి వాటి కారణంగా చేతిలో డబ్బు నిలవ ఉండే అవకాశం ఉండదు. మిత్రుల వల్ల కూడా ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ రాశివారు చేతిలో డబ్బు ఉంచుకోకపోవడం మంచిది.
- మకరం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నందువల్ల, తల్లితండ్రులు లేదా కుటుంబ సభ్యుల మీద బాగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులుంటాయి. ప్రయాణాలు లేదా విహార యాత్రల మీద ఖర్చు పెరుగుతుంది. ప్రభుత్వపరంగా కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల పాటు ఆర్థిక వ్యవహారాలను సతీమణికి అప్పగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం, అప్పులివ్వడం వంటివి పెట్టుకోకపోవడం శ్రేయస్కరం.