Investment Astrology
ప్రస్తుతం శని, బుధ, శుక్రుల మధ్య సానుకూల వీక్షణ ఏర్పడినందువల్ల ఇది కొన్ని రాశుల వారికి తప్పకుండా ధన లాభాలను చేకూరుస్తుంది. ఇందులో బుధుడు వ్యాపారానికి, శుక్రుడు ధనానికి, శనీశ్వరుడు శ్రమకు, నిలకడకు, స్థిరత్వానికి కారకులైనందువల్ల ఈ మూడు గ్రహాల పరస్పర వీక్షణ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, షేర్లు కొనడానికి, ఆర్థిక లావాదేవీలకు బాగా అనుకూలంగా ఉంది. వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారు నవంబర్ 15 లోపల ఎక్కడ ఎటువంటి పెట్టుబడులు పెట్టినా తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో బుధుడు కలిసి ఉండడం, వీటికి శనితో శుభ వీక్షణ ఏర్పడడం వల్ల కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులు కూడా వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా ఆశిం చిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. శని భాగ్య స్థానానికి అధిపతి కావడం, బుధుడు ధన స్థానా నికి అధిపతి కావడం వల్ల వీరికి సాధారణంగా ఎటువంటి వ్యాపారమైనా బాగా కలిసి వస్తుంది.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడికి పంచమ స్థానాధిపతి శుక్రుడు, భాగ్య స్థానాధిపతి శనితో వీక్షణ ఏర్పడినందువల్ల వ్యాపారాల్లో వీరి ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. స్వల్ప కాలంలో అత్యధికంగా లాభాలు పొందాలనుకునేవారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇతరుల వ్యాపా రాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. భారీగా షేర్లు కొనడం వల్ల కూడా ఆర్థిక ప్రయోజ నాలు ఉంటాయి. స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేశీలు, వడ్డీ వ్యాపారాలు ఆశించిన లాభాలను అందిస్తాయి.
- సింహం: ఈ రాశిలో బుధ, శుక్రులు యుతి చెందడం, ఈ గ్రహాలను సప్తమం నుంచి శనీశ్వరుడు వీక్షించడం వల్ల మరో మూడు నెలల పాటు వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల బాగా కలిసి వస్తుంది. లాభాలు, రాబడి దిన దినాభివృద్ధి చెందుతాయి. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. షేర్లు బాగా లాభిస్తాయి. ఇతరుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా లాభం ఉంటుంది.
- కన్య: రాశ్యధిపతి బుధుడు ధన స్థానాధిపతి శుక్రుడితో కలవడం, దాన్ని శనీశ్వరుడు వీక్షించడం వల్ల ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా ఆర్థిక లాభం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహ రించే తత్వం కలిగినవారు అవడం వల్ల ఈ రాశివారు ప్రస్తుతం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడా నికి సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపా రాలు ఈ రాశివారికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం, వీటి మీద శనీశ్వరుడి దృష్టి కారణంగా ఎటు వంటి వ్యాపారం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. షేర్లు కొనడానికి, డబ్బును వడ్డీకి ఇవ్వడానికి, మదుపులు చేయడానికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఉద్యోగులు మరింతగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశిలో ఉన్న శని సప్తమ స్థానంలో ఉన్న బుధ, శుక్రులను చూస్తున్నందువల్ల భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. సాధారణంగా ఎటువంటి వ్యాపార ప్రయత్నం తలపెట్టినా అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల షేర్ల మీద, ఇతర వ్యాపార సంస్థలో పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది.