శుభాలనిచ్చే బుధ, శుక్రుల రాశి పరివర్తన.. వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం..
నవంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బుధ, శుక్రుల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు సహజ శుభ గ్రహాలు మాత్రమే కాకుండా, పరమ మిత్ర గ్రహాలు కూడా. అందువల్ల దాదాపు ప్రతి వారికీ ఏదో ఒక శుభ ఫలితాన్నే ఇస్తాయి తప్ప చెడు చేసే అవకాశం లేదు. ప్రస్తుతం శుక్ర గ్రహానికి చెందిన తులా రాశిలో బుధుడు సంచరిస్తుండగా..

నవంబర్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బుధ, శుక్రుల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు సహజ శుభ గ్రహాలు మాత్రమే కాకుండా, పరమ మిత్ర గ్రహాలు కూడా. అందువల్ల దాదాపు ప్రతి వారికీ ఏదో ఒక శుభ ఫలితాన్నే ఇస్తాయి తప్ప చెడు చేసే అవకాశం లేదు. ప్రస్తుతం శుక్ర గ్రహానికి చెందిన తులా రాశిలో బుధుడు సంచరిస్తుండగా, 3వ తేదీన బుధుడికి చెందిన కన్యారాశిలో శుక్రుడు ప్రవేశించడం జరుగుతోంది. వాస్తవానికి కన్యారాశి శుక్రుడికి నీచ రాశి. అయితే, పరివర్తన కారణంగా, శుక్రుడికి నీచ భంగం అయింది. ఈ నీచ భంగం 6వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నుంచి నీచ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మొత్తం మీద బుధ, శుక్రుల రాశి పరివర్తన ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో పరిశీలిద్దాం.
- మేషం: ఈ రాశివారికి ఆరు, ఏడు స్థానాల మధ్య బుధ, శుక్రుల పరివర్తన జరిగింది. దీనివల్ల సాధారణంగా భార్యాభర్తల బంధం గట్టి పడుతుంది. ఇద్దరి మధ్యా విభేదాలుంటే అవి తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చు పెరిగే అవకాశం ఉంది కానీ, ఇవి హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఈ రాశికి 6,7 స్థానాల్లో పాక్షికంగా అధియోగం ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగాలలో అధికారం చేపట్టే అవకాశముంది.
- వృషభం: ఈ రాశికి అయిదు, ఆరు స్థానాల్లో బుధ, శుక్రుల పరివర్తన ఏర్పడినందువల్ల ప్రేమ, పెళ్లి వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలను పెద్దల దృష్టికి తీసుకు వచ్చి, వారి అనుమతిని సంపాదించడం జరుగుతుంది. కొత్తగా ప్రేమలో ప్రవేశిస్తున్నవారు పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేసి అనుకున్నది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు చేజిక్కించుకుంటారు.
- మిథునం: ఈ రాశివారికి నాలుగు, అయిదు స్థానాల్లో బుధ, శుక్రుల పరివర్తన జరుగుతున్నందువల్ల నాలుగు రోజుల పాటు వీరికి సమయం యోగదాయకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలైనా, పెళ్లి వ్యవహారాలైనా, సుఖాలయినా, శృంగారమైనా వీరి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుందన డంలో సందేహం లేదు. ఇందులో బుధుడు రాశ్యధిపతి కూడా అయినందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి మూడు, నాలుగు స్థానాల్లో ఈ రెండు శుభ గ్రహాల పరివర్తన చోటు చేసుకున్నందు వల్ల ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేసినా తప్పకుండా నెరవేరు తుంది. ఇంటా బయటా ఆనందకర వాతావరణం నెలకొంటుంది. గృహ, వాహన యోగాలున్నాయి. తల్లితండ్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సామాజి కంగా గౌరవ మర్యాదలు విస్తరిస్తాయి. ఇష్టమైన ప్రాంతాలను, ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి రెండు, మూడు స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల, తమకంటే ఎక్కువ స్థాయి వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది.
- కన్య: ఈ రాశి అధిపతి అయిన బుధుడితో ధన స్థానాధిపతి అయిన శుక్రుడికి పరివర్తన జరిగినందు వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. మీ మాటకు, చేతకు సర్వత్రా విలువ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
- తుల: ఈ రాశి అధిపతికి, వ్యయాధిపతికి పరివర్తన జరగడం వల్ల ప్రేమ, పెళ్లి, దాంపత్య వ్యవహారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. శృంగార జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా వెలిగి పోతుంది. ఇష్టమైన ప్రాంతాలకు, సుందర రమణీయ ప్రాంతాలకు విహార యాత్రలు చేస్తారు. విలాస జీవితం గడుపుతారు. శుభ కార్యాల మీదా, సహాయ కార్యక్రమాల మీదా బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు.
- వృశ్చికం: ఈ రాశికి 11, 12 రాశుల మధ్య పరివర్తన జరిగింది. దీని ఫలితంగా ప్రేమ వ్యవహారాల మీదా, పెళ్లి వ్యవహారాల మీదా భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. స్నేహ బృందంలోని వ్యక్తితో ప్రేమా యణం సాగించే అవకాశం ఉంది. ప్రేమలో పడ్డ వ్యక్తికి విలువైన వస్తువులు కానుకలుగా ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. సతీమణి మీద కూడా ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. ప్రముఖులైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- ధనుస్సు: ఈ రాశికి 10, 11 స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మహా యోగం పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
- మకరం: ఈ రాశివారికి 9, 10 స్థానాల మధ్య పరివర్తన చోటు చేసుకోవడం శుభ యోగమనే చెప్పాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ఎటు వంటి ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. అప్రయత్న ధన లాభం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెంపొందుతాయి.
- కుంభం: ఈ రాశికి 8,9 స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల సంపన్న యువతి లేదా యువకుడితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. వివాహం కూడా సంపన్న వ్యక్తితో నిశ్చయం అయ్యే సూచనలున్నాయి. ఈ నాలుగు రోజుల కాలంలో ప్రేమ ప్రయత్నాలు చేసేవారు తప్ప కుండా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతాయి.
- మీనం: ఈ రాశికి 7,8 స్థానాల మధ్య పరివర్తన జరుగుతోంది. దీనివల్ల అప్రయత్నంగా ప్రేమలో పడడం, అప్రయత్నంగానే పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. ఈ రాశివారిని ఎక్కువ మంది ప్రేమించే అవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధాలు కూడా నాలుగైదు ఒకేసారి కలిసి వస్తాయి. ప్రేమ ల్లోనూ, పెళ్లిళ్లలోనూ ఇందులో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనాకర్షణ పెరుగు తుంది. దాంపత్య జీవితం దృఢపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.