AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: మిథున రాశిలోకి బుధ గ్రహం.. ఆ రాశుల వారికి అన్నిటా విజయాలు..!

Mercury in Gemini: బుధ గ్రహం జూన్ 7న వృషభం నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు భద్ర మహా పురుష యోగం, వృషభ, తుల రాశులకు మహా భాగ్య యోగం కలిగిస్తుంది. ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో వృద్ధి, ఆరోగ్య పురోగతి వంటి శుభ ఫలితాలు పొందుతారు.

Budh Gochar: మిథున రాశిలోకి బుధ గ్రహం.. ఆ రాశుల వారికి అన్నిటా విజయాలు..!
Maha Bhagya Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 31, 2025 | 12:40 PM

Share

Mercury Transit 2025: ఈ నెల 7వ తేదీన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న బుధ గ్రహం అదే రాశిలో ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. తన స్వస్థానమైన మిథునంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల బుధుడికి విపరీతంగా బలం పెరుగుతుంది. ఈ మిథునం కేంద్రం (1, 4, 7, 10 స్థానాలు)గా ఉన్న రాశులకు దీనివల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది. భద్ర మహా పురుష యోగం అంటే ఉన్నత స్థాయికి వెళ్లే యోగం. మిథున రాశిలోని బుధుడి వల్ల మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు ఈ భద్ర మహా పురుష యోగం పడుతోంది. అంతేకాక, ఈ నాలుగు రాశులతో పాటు వృషభ, తులా రాశుల వారికి మహా భాగ్య యోగం పట్టడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి ధన స్థానాధిపతిగా అత్యంత శుభుడైన బుధుడు తన స్వస్థానంలో ప్రవేశించడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు ఈ రాశి వారి ముందుకు వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
  2. మిథునం: ఈ రాశి కేంద్రంలో బుధుడి ప్రవేశం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరిగి, రాబడి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సంపద విషయంలోనూ, వృత్తి, ఉద్యోగాల పరంగానూ ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు.
  3. కన్య: ఈ రాశివారికి దశమ కేంద్రంలో బుధుడి స్వస్థాన సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో సామాన్యుడు సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కా రం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
  4. తుల: ఈ రాశికి భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల మహా భాగ్య యోగం పడుతుంది. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఒక సంపన్నుడి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడి స్వస్థాన సంచారం వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడమే కాకుండా, ఒక ప్రముఖుడి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలు బాగా తగ్గుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో బుధ సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశముంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తుపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..