
Lucky Zodiac Signs
జూన్ 4వ తేదీ వరకు తన నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ 20 రోజుల కాలంలో కొన్ని రాశులకు ఊహించని అదృష్టాలు కలగజేయబోతున్నాడు. ప్రస్తుతం కుజుడు స్తంభించి ఉండడం వల్ల ఆ గ్రహం బలం బాగా పెరిగింది. మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల మీద ఈ గ్రహం వరాల వర్షం కురిపించే అవకాశం ఉంది. అధికారానికి, ఆస్తిపాస్తులకు కారకుడైన కుజుడు ఈ రాశులవారిని ఆస్తిపాస్తులతో, ఆదాయంతో అనుగ్రహించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో స్తంభించినందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆర్థిక బలం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. భూలాభాలు ఎక్కువగా కలుగుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంవారు అత్యధిక లాభాలు పొందుతారు.
- కర్కాటకం: ఈ రాశిలో కుజుడు స్తంభించడం వల్ల సొంత ఇల్లు, సొంత వాహనం అమరే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం కలుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఎలాంటి ప్రయత్నమైనా రెట్టింపు ఫలితాలనిస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడు స్తంభించడం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తప్పకుండా భూ లాభం కలుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. ఉద్యోగులకు, నిరు ద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. తోబుట్టువులతో విభేదాలు సమసిపోయి సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడికి బలం పెరగడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆస్తి సమ స్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, ధన లాభం కలుగుతాయి. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయానానికి అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు భాగ్య స్థానంలో బలం పుంజుకున్నందువల్ల వారసత్వ సంపద లభిస్తుంది. తండ్రి వైపు నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి.
- మీనం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశికి పంచమ స్థానంలో స్తంభించడం వల్ల వ్యక్తిగతం గానూ, కుటుంబపరంగానూ కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదా యం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా ఆస్తి లాభం కలుగుతుంది.