జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. అంగారక గ్రహం ధైర్యం, శక్తికి కారకంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,ప్రతి 45 రోజులకు అంగారకుడు తన రాశిని మార్చుకుంటాడు. అంగారకుడి రాశిలో మార్పు జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటనగా వర్ణించబడింది. 2025లో కుజుడు కర్కాటకరాశిని విడిచి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు.
జనవరి 21న కుజుడు మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. తిరోగమనంలో కుజుడు మిధున రాశిలో అడుగు పెట్టనున్నాడు. ఇలా ఏప్రిల్ 7 వరకు ఈ రాశిలోనే సంచరించనున్నాడు. మిథునరాశిలో అంగారకుడి సంచారం వల్ల మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు మంచి జరుగుతుంది.. అదే సమయంలో కొన్ని రాశులు అష్టకష్టాలు ఎదుర్కొంటాయి. ఈ రోజు అంగారక గ్రహ సంచారం ఎవరికి ఇబ్బంది కలిగిస్తుందో ఆ మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మిధున రాశి: కుజుడు మిథునరాశికి 6వ , 11వ గృహాలకు అధిపతిగా పరిగణించబడతాడు. కుజుడు సంచారము మిథునరాశి లగ్న గృహంలో ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆందోళనలు పెరగవచ్చు. వీరు చేపట్టిన ప్రతి పనిలో ప్రతికూల ఫలితాలను పొందవచ్చు. అప్పులు చేయాల్సి రావచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు అనేక ఇబ్బందులు పడతారు. గౌరవం దెబ్బతింటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
వృశ్చిక రాశి: కుజుడు వృశ్చిక రాశికి లగ్నానికి, ఆరవ ఇంటికి అధిపతి. ఈ రాశి వారి కుండలిలో 8వ ఇంట్లో మిథునరాశిలో కుజుడు సంచరించనున్నాడు. దీని వలన ఈ రాశి ప్రభావితమవుతుంది. ఈ సమయంలో వీరు చేపట్టిన ఏ పని అయినా సరే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు రావచ్చు. ఈ మార్పులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. వీరు కలత చెందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి ఐదవ, 12 వ గృహాలకు అంగారకుడు అధిపతి. వీరి ఏడవ ఇంట్లో మిథునరాశిలో కుజుడు సంచరించడం వల్ల ప్రభావితమవుతుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు తమ స్నేహితులతో ఉన్న సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు. అంతేకాదు పిల్లల గురించి కూడా ఆందోళన పడతారు. అనేక సమస్యలు ఏకకాలంలో చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు అసంతృప్తిగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ధైర్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.