Money Astrology
కుజ, బుధులు కలిస్తే పోరాట పటిమ, పట్టుదల పెరుగుతాయి. వారు తమ పని అయ్యే వరకూ వదిలిపెట్టరు. అందులోనూ ఈ రెండు గ్రహాలు ధన వ్యామోహం ఎక్కువగా ఉండే ధనూ రాశిలో కలవడం ఇటువంటి లక్షణాలకు మరింత బలం చేకూరుస్తుంది. ఈ రాశిలో ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆర్థిక సంబంధమైన పట్టుదల మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. తమకు రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి వీరు ఎటువంటి ప్రయత్నానికైనా వెనుకాడరు. ముఖ్యంగా మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభరాశి వారిలో ఈ ఆర్థిక సంబంధమైన పట్టుదల పెరగడానికి అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల మీదా గురువు దృష్టి కూడా ఉన్నందు వల్ల వీరి ప్రయత్నాలు, పోరాటాలు, పట్టుదలలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కుజ, బుధులు కలిసినందువల్ల తమకు వృత్తి, ఉద్యోగాల్లోనూ, బాకీలు, బకాయిల పరంగానూ రావలసిన డబ్బు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. పోరాటాలు సాగించడానికి కూడా సిద్ధపడతారు. ఆస్తి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నడుం బిగిస్తారు. ఈ రాశి నుంచే ఈ రెండు గ్రహాల మీదా గురు దృష్టి ఉన్నందువల్ల వీరు తమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు.
- మిథునం: సప్తమ స్థానంలో ఈ రాశ్యధిపతి బుధుడితో కుజుడు చేరినందువల్ల సాధారణంగా ఆస్తి వివాదా లను ఏదో విధంగా పరిష్కరించుకోవడం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఆర్థిక సంబంధ మైన వ్యక్తిగత సమస్యలను గట్టి పట్టుదలతో పరిష్కరించుకోవడం, తమకు రావలసిన డబ్బును పోరాటం సాగించయినా రాబట్టుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో తనకు రావలసిన ప్రమోషన్ గురించి, తనకు రావలసిన బకాయిల గురించి గట్టిగా ప్రయత్నించి సాధించే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల వీరు ఏ సమస్యనూ తేలికగా విడిచిపెట్టే అవకాశం ఉండదు. విదేశీయానానికి సంబంధించిన అవరోధాలను పట్టుదలగా పరిష్కరించుకుం టారు. సోదరులతో తలెత్తిన ఆస్తి వివాదాన్ని లౌక్యంగా తొలగించుకుంటారు. ప్రమోషన్, ఇంక్రి మెంట్ సమస్యలపై అధికారులతో తేల్చుకునే అవకాశం ఉంటుంది. తనకు ఏ విధమైన అన్యాయం జరిగినా ప్రతిఘటించడం జరుగుతుంది. గురు దృష్టి కారణంగా ఈ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.
- వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో కుజ, బుధుల కలయిక వల్ల ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మీద వీరి దృష్టి కేంద్రీకృతమవుతుంది. రాదనుకుని వదిలేసుకున్న సొమ్మును సైతం పోరాడి వసూలు చేసుకునే అవకాశం ఉంది. మొండి బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం ప్రారంభ మవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో నిక్కచ్చిగా, నిష్కర్షగా వ్యవహరించడం జరుగుతుంది. బంధు మిత్రులను కూడా వదిలిపెట్టడం జరగదు. వీరి ప్రయత్నాలు ఫలించి వీరి ఆర్థిక స్థితి బాగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశిలోనే కుజ, బుధులు కలవడం, పైగా ధన కారకుడైన గురువు దృష్టి వీటి మీద పడడం వల్ల తనకు చెందవలసిన సొమ్మును రాబట్టుకోవడానికి ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధపడడం జరుగుతుంది. బంధుమిత్రుల నుంచే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా తమకు న్యాయంగా రావల సిన డబ్బు కోసం పట్టుదలగా ప్రయత్నించే అవకాశం ఉంది. వీరి పట్టుదల, ప్రయత్నాల కార ణంగా ఆస్తి వివాదం కూడా పరిష్కారం అవుతాయి. వీరి అవిశ్రాంత ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.
- కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో కుజ, బుధులు కలవడం వల్ల సాధారణంగా వడ్డీ వ్యాపారులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో వీరు రాజీపడే అవకాశమే ఉండదు. అవసరమైతే సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించడానికి కూడా వీరు వెను కాడకపోవచ్చు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడంతో పాటు, రావలసిన డబ్బు కోసం అధికా రులతో అమీ తుమీ తేల్చుకోవడం, చివరికి అనుకున్నది సాధించడం జరుగుతుంది.