AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 22, 2024): మేష రాశి వారి వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మిథునం రాశి వారి ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధార పడడం ప్రారంభిస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే, మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 22, 2024 | 6:43 AM

Share

దిన ఫలాలు (జనవరి 22, 2024): మేష రాశి వారి వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మిథునం రాశి వారి ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధార పడడం ప్రారంభిస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే, మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్వయం ఉపాధివారు సైతం లాభాలు గడిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధార పడడం ప్రారంభిస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టాల్సి వస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదు రైనా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయ స్కరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చల నానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ఇంట్లో శుభకార్యం తలపెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ మారడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సతీ మణితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అయితే, అదనపు బాధ్యతల వల్ల ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసు కుంటారు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. రావలసిన ధనం వసూలు అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగ స్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఇంట్లో అదనపు సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్ట పోతారు.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్త వుతాయి. ఆదాయం, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

Follow Us