Lunar Eclipse 2022: రేపు ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం.. ఈ మూడు రాశులవారిపై తీవ్ర ప్రభావం…

|

May 15, 2022 | 3:52 PM

రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంలో చూపనప్పటికీ.. ఇతర దేశాలలో నివసించే వారి రాశులపై  ప్రభావం చూపుతుంది. ఈ కథనంలో గ్రహణ సమయం, ఏ రాశుల వారిపై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం..  

Lunar Eclipse 2022: రేపు ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం.. ఈ మూడు రాశులవారిపై తీవ్ర ప్రభావం...
Lunar Eclipse 2022
Follow us on

Lunar Eclipse 2022: ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం (Chandra grahan 2022) రేపు అంటే మే 16న ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  ఈ చంద్రగ్రహణం వైశాఖ నక్షత్రం..  వైశాఖ పూర్ణిమ నాడు వృశ్చిక రాశిలో సంభవిస్తుంది. శాస్త్రీయ దృక్కోణంలో ఖగోళ సంఘటనగా పరిగణించబడుతున్నప్పటికీ, సనాతన ధర్మంలో గ్రహణం  ప్రత్యేకత, ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. భూమి.. చంద్రుడు. సూర్యుని మధ్య ఉన్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మరోవైపు.. హిందూమత పరంగా చూస్తే, గ్రహణం సూర్యుడు, చంద్రుడు.. రాహుకేతువులు సంబంధించినదని నమ్మకం. రాహు, కేతువుల కారణంగా చంద్రుడు, సూర్య దేవుడు గ్రహణ సమయంలో ఇబ్బందులు పడతారని.. అశుభకరంగా పరిగణించబడుతుంది. గ్రహణం కారణంగా దేవతలు ఇబ్బందులు పడుతున్నారని.. కనుక ఆ గ్రహణ ప్రభావం మనుషులపై కూడా ఉంటుందని నమ్మకం.

రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంలో చూపనప్పటికీ.. ఇతర దేశాలలో నివసించే వారి రాశులపై  ప్రభావం చూపుతుంది. ఈ కథనంలో గ్రహణ సమయం, ఏ రాశుల వారిపై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం..

చంద్ర గ్రహణ సమయం
భారత కాలమానం ప్రకారం.. గ్రహణం 16 మే 2022 ఉదయం 8.59 గంటలకు సంభవిస్తుంది.. ఉదయం 10.23 వరకు కొనసాగుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంలో గ్రహణం ప్రభావం లేదు కనుక.. సూత కాల ప్రభావం చూపించదు.

ఇవి కూడా చదవండి

ఏ రాశులపై ప్రభావం చూపించనున్నదంటే..  

తుల రాశి: ఈ రాశి వారు గ్రహణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారం లేదా ఉద్యోగంలో నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అత్యుత్సాహం నష్టం కలిగిస్తుంది. ఎవరినైనా పూర్తిగా లేదా గుడ్డిగా నమ్మి మోసపోవచ్చు. అంతేకాదు లాభాలు పొందే చోట కూడా నష్టాలు ఎదుర్కోవచ్చు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా పని చేయాలి. కర్కాటక రాశి వారికి పిల్లల విషయంలో సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. పిల్లల కెరీర్‌పై చెడు ప్రభావం చూపించనున్నది. గ్రహణ సమయంలో ఈ రాశివారు  పూజలు చేయడం..  ధాన్యాలు దానం చేయడం ప్రయోజనం ఏర్పడుతుంది. అంతేకాదు దుబారా ఖర్చులను తగ్గించుకోండి.

మకర రాశి: ఈ రాశివారికి చంద్రగ్రహణం మంచిది కాదని నమ్మకం. ఈ రాశికి శని దేవుడే అధిపతి కాబట్టి ఈ రాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన వివాదాలు హాని కరం కావచ్చు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..