Zodiac Signs: ఆ స్థిర రాశుల వారికి అరుదైన యోగాలు.. అదృష్టానికి తిరుగుండదు..!

| Edited By: Janardhan Veluru

May 29, 2024 | 4:13 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్థిర రాశులు. ఈ రాశుల వారికి ప్రస్తుతం అత్యంత అరుదైన యోగ కాలం నడుస్తోంది. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయం, అధికారం వంటి కీలక విషయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

Zodiac Signs: ఆ స్థిర రాశుల వారికి అరుదైన యోగాలు.. అదృష్టానికి తిరుగుండదు..!
Rare Yogas
Follow us on

జ్యోతిషశాస్త్రం ప్రకారం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్థిర రాశులు. ఈ రాశుల వారికి ప్రస్తుతం అత్యంత అరుదైన యోగ కాలం నడుస్తోంది. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయం, అధికారం వంటి కీలక విషయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. బాగా ఉన్నత స్థాయి వ్యక్తులుగా చెలామణీ అవుతారు. అందుకు ప్రధాన కారణం ఈ రాశుల వారికి రెండు అరుదైన మహా పురుష యోగాలు ఏర్పడడమే. అందులో ఒకటి శని కారణంగా ఏర్పడిన శశ మహా పురుష యోగం కాగా, మరొకటి శుక్రుడి కారణంగా ఏర్పడిన మాలవ్య మహా పురుష యోగం. ఈ రెండు యోగాలు ఒకేసారి ఏర్పడడం ఈ రాశివారికి డబుల్ ధమాకా లాంటిది. రాశి కేంద్రాల్లో, అంటే 1,4,7,10 స్థానాల్లో శనీశ్వరుడు, శుక్రుడు ఉచ్ఛ, స్వస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ యోగాలు ఏర్పడతాయి. నెల రోజుల పాటు వీరి అదృష్టానికి తిరుగుండదు.

  1. వృషభం: ఈ రాశి శుక్రుడికి స్వస్థానం. శుక్రుడు ఇప్పుడు ఇదే రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. శని దశమంలో స్వస్థానంలో సంచారంచేస్తున్నందు వల్ల శశ మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రెండు యోగాల వల్ల వీరు సమాజంలో ప్రముఖులుగా చెలామణి కావడం జరుగుతుంది. తిరుగులేని భాగ్య, ఐశ్వర్య యోగాలు వీరి సొంత మవుతాయి. రాజకీయంగా ప్రాముఖ్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జనాకర్షణ అధికమవుతుంది. శ్రీమంతుల స్థాయికి చేరుకునే అవకాశముంది.
  2. సింహం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య యోగం, సప్తమ కేంద్రంలో శని సంచారం వల్ల శశ యోగం ఏర్పడ్డాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అధికార యోగం, ఆదాయ వృద్ధి యోగం పడతాయి. నిరుద్యోగులకు ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కలలు సాకారం అవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా కలలో కూడా ఊహించని స్థితికి చేరుకుంటారు. జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. వృశ్చికం: చతుర్థ కేంద్రంలో శని వల్ల శశ యోగం, సప్తమ కేంద్రంలో శుక్రుడి వల్ల మాలవ్య యోగం ఏర్పడ్డాయి. ఈ యోగాల వల్ల వీరికి తప్పకుండా గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సంపన్నుల కుటుం బంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా అదృష్టవంతులవుతారు.
  4. కుంభం: ఈ రాశిలో శని సంచారం వల్ల శశ యోగం, చతుర్థ కేంద్రంలో శుక్రుడి వల్ల మాలవ్య యోగం ఏర్పడ్డాయి. వీటివల్ల ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఉద్యోగాల్లో అత్యున్నత స్థానానికి వెళ్లడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన యోగాలు ఏర్పడతాయి. విహార యాత్రలు అధికమవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఐశ్యర్యవంతు లయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.