హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం హిందు క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 26న ఈ పండగ వచ్చింది. శ్రీ కృష్ణ జన్మదినోత్సవాన్ని కృష్ణాష్టమిగా దేశ విదేశాల్లోని కన్నయ్య భక్తులు అత్యంత భక్తీ శ్రద్దలతో జరుపుకుంటారు. దేశ విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీ కృష్ణాష్టమి పండగను రెండు రోజుల పాటు హిందువులు మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న కన్నయ్య భక్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమిలో మొదటి రోజున ఈ పండగను అందరూ జరుపుకుంటే.. రెండవ రోజున వైష్ణవులు జరుపుకుంటారు. అయితే ఈ నెల 26వ తేదీన మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్యులు చెప్పారు. అంతేకాదు శ్రీ మహా విష్ణువుకు కొన్ని రాశులు అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశులవారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పట్టిందల్లా బంగారమే అని జ్యోతిష్కులు చెబుతున్నారు.
శ్రీకృష్ణునికి ఇష్టమైన రాశులు ఏమిటంటే..
వృషభ రాశి: కన్నయ్యకు ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ఒకటి. కృష్ణాష్టమి రోజున వీరికి కన్నయ్య అనుగ్రహంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి అవుతాయి. అంతే కాదు ఆర్ధిక పురోభివృద్ధి అందుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తిని పొందుతారు.
కర్కాటక రాశి: ఈ రాశి అన్నా కూడా శ్రీ కృష్ణుడికి ఇష్టమే.. వీరికి దైవ అనుగ్రహం లభిస్తుంది. దీంతో వీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. అంతేకాదు జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగి సక్సెస్ అందుకుంటారు. ఎప్పటి నుంచో బాధపెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు.
సింహరాశి: శ్రీ కృష్ణుడుకి ఎంతో ఇష్టమైన రాశుల్లో సింహరాశి ఒకటి. ఈ రాశులకు చెందిన వ్యక్తులపై కన్నయ్య అనుగ్రహం అపారంగా ఉంటుంది. వీరు దైర్యంగా పనులు చేపడతారు. కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి.
తులారాశి: ఈ రాశి అంటే కూడా కన్నయ్యకు ఇష్టమే.. వీరిపై శ్రీకృష్ణుని అనుగ్రహం అపారంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాదు చేసిన పనికి తగిన డబ్బులు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న డబ్బులు వసూలు అవుతాయి. అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులు కూడా సులభంగా చేస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు