Lord Ganesh’s Favourite Zodiacs: సనాతన హిందూ ధర్మంలో పార్వతీపుత్ర వినాయకుడిని ఆదిదేవుడిగా పూజిస్తారు. ముఖ్యంగా చిన్నాపెద్దా అని లేకుండా ఏ శుభకార్యమైనా గణపతినే ముందుగా పూజిస్తారు. ఎందుకంటే గణనాథుని అనుగ్రహ, ఆశీర్వాదాలు ఉన్నవారి జీవితం ఆష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండి ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిచక్రంలోని కొన్ని రాశులు లంబోధరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. వాటిపై ఆయన ఆనుగ్రహం, ఆశీర్వాదం సర్వకాలల్లోనూ నిండుగా ఉంటుంది. ఆ కారణంగానే ఆయా రాశులకు అనునిత్యం లాభాలు, సంతోషాలు కలుగుతాయి. మరి విఘ్ననాయకుడికి ఇష్టమైన ఆ రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..
కన్యారాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణనాథుని ఆశీస్సులు కన్యా రాశి వారిపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధ గ్రహం అయినందును ఈ రాశివారు ఎంతో తెలివి కలిగినవారిగా ఉంటారు. ఇంకా ఈ రాశివారు విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రాశిలో జన్మించిన కారణంగా విద్యా, వ్యాపార రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు. ముఖ్యంగా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.
మకరరాశి: మకర రాశి వారిపై కూడా మూషికవాహనుడి అనుగ్రహం ఉంటుంది. వీరు తలపెట్టిన ప్రతిపనిలోనూ వినాయకుడు తోడుగా ఉండి, విజయం చేకూరేలా చేస్తాడు. ఇంకా మకరరాశికి శనిదేవుడు అధిపతి అయినందున ఈ రాశివారిపై గణపతి అనుగ్రహంతో పాటు శనీశ్వరుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఫలితంగా కష్టసుఖాలను అధిగమించగల స్థైర్యాన్ని కలిగి, విజయపథంలో నడుస్తారు.
మేషరాశి: గంగాపుత్రుడికి ఇష్టమైన రాశులలో మేషం కూడా ఒకటని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశికి కుజుడు అధిపతి అయినందును మేషరాశిలో జన్మించినవారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇందుకు అదనంగా గజాననుడి ఆశీర్వాదం ఉండడం వల్ల మేషరాశివారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్స్, విద్య రంగంలో కీర్తి ప్రతిష్టలు వంటివి వీరిని వరిస్తాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..