కీలక రాశులకు బలం.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే..! వారికి ఉద్యోగ యోగం

Zodiac Signs: ఈ నెల(నవంబర్) 16 నుంచి శని, శుక్ర, రవుల బలం బాగా పెరుగుతోంది. దీని వల్ల వృషభ, సింహ, తుల, మకర, కుంభ రాశుల వారికి నెలాఖరు వరకు శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇందులో రవి తనకు మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ప్రవేశించడం, శుక్రుడు గురువుతో పరివర్తన చెందడం, శని స్వక్షేత్రంలో రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ మూడు గ్రహాలకు, వాటి ఆధిపత్యంలో ఉన్న అయిదు రాశులకు బలం పెరుగుతోంది

కీలక రాశులకు బలం.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే..! వారికి ఉద్యోగ యోగం
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 13, 2024 | 3:59 PM

ఈ నెల 16 నుంచి శని, శుక్ర, రవుల బలం బాగా పెరుగుతున్నందువల్ల వృషభ, సింహ, తుల, మకర, కుంభ రాశుల వారికి నెలాఖరు వరకు శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇందులో రవి తనకు మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ప్రవేశించడం, శుక్రుడు గురువుతో పరివర్తన చెందడం, శని స్వక్షేత్రంలో రుజు మార్గంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ మూడు గ్రహాలకు, వాటి ఆధిపత్యంలో ఉన్న అయిదు రాశులకు బలం పెరుగుతోంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి కావడం, కొత్తగా ధనాదాయ అవకాశాలు ఏర్పడడం, కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా విజయాలు లభిస్తాయి.

  1. వృషభం: రాశినాథుడు శుక్రుడు గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ రాశివారికి ధనాదాయం విష యంలో వృద్ధిలోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో భారీగా లాభాలు పొందడం జరుగుతుంది. అంచనాలకు మించి లాభాలు పెరగడం వల్ల వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలో చన చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి తప్పకుండా అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది.
  2. సింహం: రాశినాథుడైన రవి తనకు ఉచ్ఛరాశితో సమానమైన వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి రాజయోగం పడుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు విజయాలు సాధించడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయ త్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది.
  3. తుల: రాశినాథుడు శుక్రుడికి గురువుతో పరివర్తన జరిగినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది. ఉద్యో గంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరు ద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది.
  4. మకరం: రాశ్యధిపతి శని వక్రగతి నుంచి బయటపడి రుజు మార్గంలో పయనిస్తున్నందువల్ల ఆదాయ పరంగా అనుకూలతలను పెంచడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందు తుంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబం ధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటి బాగా పెరుగుతుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  5. కుంభం: రాశ్యధిపతి శని రుజు మార్గంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఈ రాశి వారికి శశ మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. సామాజికంగా ప్రాభవం బాగా పెరుగుతుంది. ఒక ప్రముఖుడుగా చెలామణీ అవుతారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి రాజయోగాలు పడతాయి. జనాకర్షణ పెరుగుతుంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే