Zodiac Signs: రెండు రాశుల్లో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరే యోగం..

| Edited By: Janardhan Veluru

Mar 20, 2024 | 11:20 AM

కుంభ, మీన రాశుల్లో మూడు గ్రహాల వంతున కేంద్రీకృతం కావడం వల్ల కొన్ని రాశులకు ఒక విధమైన మహా లక్ష్మీయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని జ్యోతిషశాస్త్రంలో ఇష్టకార్య ఫల సిద్ధి యోగమని కూడా అంటారు. కుంభ రాశిలో శని, కుజ, శుక్రులు, మీన రాశిలో రవి, బుధ, రాహువులు ఉండడం యోగదాయక ఫలితాలనిస్తుంది.

Zodiac Signs: రెండు రాశుల్లో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరే యోగం..
Maha Lakshmi Yoga
Follow us on

కుంభ, మీన రాశుల్లో మూడు గ్రహాల వంతున కేంద్రీకృతం కావడం వల్ల కొన్ని రాశులకు ఒక విధమైన మహా లక్ష్మీయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని జ్యోతిషశాస్త్రంలో ఇష్టకార్య ఫల సిద్ధి యోగమని కూడా అంటారు. కుంభ రాశిలో శని, కుజ, శుక్రులు, మీన రాశిలో రవి, బుధ, రాహువులు ఉండడం యోగదాయక ఫలితాలనిస్తుంది. పైగా కుంభ రాశి అధిపతి శనీశ్వరుడు కుంభంలో, మీన రాశి అధిపతి గురువు మేషంలో బలంగా ఉండడం వల్ల కూడా ఈ యోగాన్ని మరింత పటిష్టం చేయడం జరుగుతుంది. ఈ యోగం ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. ఈ అరుదైన యోగం వల్ల అద్భుతమైన యోగం పట్టే రాశుల్లో మేషం, వృషభం, మిథునం, వృశ్చికం, మకరం, కుంభ రాశులున్నాయి.

  1. మేషం: ఈ రాశికి ఈ నెల రోజుల కాలంలో అంచనాలకు మించి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఎటువంటి ఘన కార్యమైనా సాదించగలుగుతారు. మనసులోని ముఖ్యమైన కోరి కలు నెరవేరడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయా సంగా నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆశించిన శుభ వార్తలు వినడంతో పాటు, ఆశించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విలాస జీవితం గడపడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి ఈ మహా లక్ష్మీయోగం వల్ల సిరిసంపదలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వీరి జీవన శైలి మారిపోతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. భోగ భాగ్యాలు వీరి సొంతం అవుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆదాయ పరంగా దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగులు, నిరు ద్యోగుల జీవితాల్లో ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. మిథునం: ఈ రాశివారికి ఈ ఇష్ట కార్యసిద్ధి యోగం నూటికి నూరు పాళ్లు వర్తించే అవకాశం ఉంది. ఈ నెల 28 లోపల వీరి ఆర్థిక స్థితి బాగా మార్పు చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా విజయవంతం అవుతాయి. జీవన శైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశివారికి దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా మహా లక్ష్మి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఆదాయం పెరగడం, లాభాలు, రాబడి వృద్ధి చెందడం, ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక, ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి ధన స్థానం పటిష్టంగా ఉండడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వచ్చే అవ కాశం ఉంది. ఇప్పుడు చేపట్టే ప్రయత్నాలు, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా కూడా అపార ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది.
  6. కుంభం: ఈ రాశివారికి ఈ అరుదైన యోగం వల్ల సిరిసంపదలు అనూహ్యంగా వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. అన్ని విధాలుగానూ రాబడి పెరుగుతుంది. అదనపు ఆదాయానికి అవకాశాలుంటాయి. పట్టిందల్లా బంగారం అవు తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన మనసులోని కోరికలు చాలావరకు నెరవేరు తాయి.