Money & Luck Horoscope: ధనూ రాశిలో కీలక గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఆర్థిక అదృష్టం పట్టబోతోంది..!

ప్రస్తుతం ధనూ రాశికి బలం పెరిగింది. ఈ రాశిలో కుజ, బుధ, శుక్ర గ్రహాలు యుతినొందడం, దాన్ని మేష రాశి నుంచి ధనూ రాశినాథుడైన గురువు వీక్షించడం ఇందుకు ఒక కారణంగా కాగా, ధనూ రాశిలోని కుజుడితో గురువు పరివర్తన చెందడం మరో ముఖ్యమైన కారణం. ఈ విధంగా మూడు గ్రహాలు ధనూ రాశిలో కలిసి గురువు వీక్షణ పొందడం వల్ల ఆరు రాశుల వారు విశేషంగా ప్రయోజనాలు అనుభవించబోతున్నారు.

Money & Luck Horoscope: ధనూ రాశిలో కీలక గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఆర్థిక అదృష్టం పట్టబోతోంది..!
Money & Luck Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 25, 2024 | 1:29 PM

ప్రస్తుతం ధనూ రాశికి బలం పెరిగింది. ఈ రాశిలో కుజ, బుధ, శుక్ర గ్రహాలు యుతినొందడం, దాన్ని మేష రాశి నుంచి ధనూ రాశినాథుడైన గురువు వీక్షించడం ఇందుకు ఒక కారణంగా కాగా, ధనూ రాశిలోని కుజుడితో గురువు పరివర్తన చెందడం మరో ముఖ్యమైన కారణం. ఈ విధంగా మూడు గ్రహాలు ధనూ రాశిలో కలిసి గురువు వీక్షణ పొందడం వల్ల ఆరు రాశుల వారు విశేషంగా ప్రయోజనాలు అనుభవించబోతున్నారు. దాదాపు ఏప్రిల్ చివరి వారం వరకు మేషం, కర్కాటకం, సింహం, తుల, కుంభం, మీన రాశుల వారికి అనేక అంశాలలో ఆర్థికంగా అదృష్టం పట్టబోతోంది. ఈ ఆరు రాశుల వారు మరో రెండు మూడు నెలల పాటు ఆర్థిక ప్రయత్నాలను ఎంత ముమ్మరం చేస్తే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కుజ, బుధ, శుక్రులు కలవడం, దానిని గురువు వీక్షించడం వల్ల ఆర్థిక పరిస్థితి విషయంలో ఊహించని స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా కలిసి వస్తుంది. విదేశీ సొమ్మును తినే యోగం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. జీతభత్యాలు, రాబడి, సంపాదన వంటివి పెరుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి ఉపచయ స్థానమైన ఆరవ రాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా డిమాండ్ పెరగడంతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడి, రాబడి బాగా పెరగడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాలు పుంజుకుని, లాభాల బాటపడతాయి.
  3. సింహం: ఈ రాశివారికి పంచమ స్థానంలో మూడు శుభ గ్రహాలు చేరడంతో పాటు, పంచమ, దశమ స్థానాల మధ్య పరివర్తన కూడా చోటు చేసుకున్నందువల్ల, విపరీతంగా అదృష్టం పట్టే అవకాశం ఏర్పడింది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు అత్యుత్తమ ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త పథకాలు ప్రవేశపెట్టి విశే షంగా లాభాలు గడించడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
  4. తుల: ఈ రాశికి ఉపచయ స్థానమైన, అంటే ఆదాయ వృద్ది స్థానమైన తృతీయంలో మూడు గ్రహాలు చేర డం వల్ల, ఈ కలయికను గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి కుబేర యోగం ఏర్పడింది. అసాధారణంగా వీరి ఆదాయం వృద్ధి చెందుతుంది. భోగభాగ్యాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు సమకూరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా రాణిస్తాయి.
  5. కుంభం: ఈ రాశికి ఉపచయ స్థానమైన, అంటే లాభ స్థానమైన ధనూ రాశిలో ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల అనేక మార్గాలతో భాగ్యం పెరుగుతుంది. విశేషంగా సంపద వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని విధంగా ప్రమోషన్ లభించడం, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. ఆర్థిక సంబంధంగా మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి తప్పకుండా నెరవేరుతాయి.
  6. మీనం: ఈ రాశికి ఉపచయ స్థానమైన దశమంలో మూడు గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల, దాన్ని రాశ్యధిపతి గురువు వీక్షిస్తున్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ తప్పకుండా విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రమోషన్లు రావడంతో పాటు అంచనాలకు మించి జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.