Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 26, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది కానీ, స్నేహితుల మీద ఖర్చులు పెరుగుతాయి.వృషభ రాశి వారికి వాహన యోగం పడుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
Horoscope Today 26th January 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 26, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 26, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది కానీ, స్నేహితుల మీద ఖర్చులు పెరుగుతాయి.వృషభ రాశి వారికి వాహన యోగం పడుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది కానీ, స్నేహితుల మీద ఖర్చులు పెరుగుతాయి. సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలలో విలువైన వస్తువులు లేదా పత్రాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు స్నేహితుల సహాయంతో తేలికగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. వాహన యోగం పడుతుంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, అధికా రుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తే మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. పొదుపు మార్గాలను అనుసరిస్తారు. కీలకమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల కోసం వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. బంధువు లతో కలిసి శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆహార, విహారాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వ్యాపారా లలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో, బేరసారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవద్దు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఇతరులకు వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండడానికి ఇది సమ యం కాదు. అదనపు ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా నిలకడగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహాలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో మీ నిర్ణయాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. ఎవరికీ ఎక్కడా హామీలు ఉండవద్దు. ఇరకాటంలో పడే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు ఆశాజనకంగా సాగిపోతాయి. శుభ గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. గతంలో తీసుకున్ననిర్ణయాలు, చేసిన ప్రయత్నాలు ‍సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. వైద్య ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో ప్రయాణిస్తాయి. చిన్న ప్రయత్నమైనా ఎక్కువ ఫలితాన్నిస్తుంది. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉపయోగకరమైన స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా రాబడి ఆశాజనకంగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయ వృద్ధికి కొత్త ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో శ్రమాధిక్యత కనిపిస్తోంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. అనుకున్న సమయా నికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద భాగా ఖర్చు చేయడం జరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అందరినీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఆర్థికపరమైన ప్రయత్నాలు అనుకూల మైన ఫలితాలనిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇంటికి అవసరమైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండ వద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. అవసరానికి తగిన ధనం అందుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం పరవాలేదు.