Free Astro Predictions: ఈ రాశుల చెందిన ఉద్యోగులకు అధికార యోగం..! ఇందులో మీ రాశి ఉందా..?

చంద్రుడున్న రాశి నుంచి 6,7,8 రాశులలో గ్రహాలున్నప్పుడు దాన్ని అధియోగం అంటారు. చంద్రుడికి 6,7,8 రాశుల్లో పాప గ్రహాలున్నప్పుడు పాపాధియోగమనీ, శుభ గ్రహాలున్నప్పుడు శుభాధియోగమనీ అంటారు. ఈ యోగం పట్టినప్పుడు తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టడం, హోదా పెరగడం జరుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంటుంది.

Free Astro Predictions: ఈ రాశుల చెందిన ఉద్యోగులకు అధికార యోగం..! ఇందులో మీ రాశి ఉందా..?
కర్కాటక రాశి: త్రిగ్రాహి యోగం కారణంగా కర్కాటక రాశివారు మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి తమ కోరిక నెరవేరుతుంది. కర్కాటక రాశివారికి వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు పెరుగుతాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. చదువు కొనసాగిస్తున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలమైనదిగా ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులతో రాణిస్తారు.
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 24, 2024 | 7:07 PM

చంద్రుడున్న రాశి నుంచి 6,7,8 రాశులలో గ్రహాలున్నప్పుడు దాన్ని అధియోగం అంటారు. చంద్రుడికి 6,7,8 రాశుల్లో పాప గ్రహాలున్నప్పుడు పాపాధియోగమనీ, శుభ గ్రహాలున్నప్పుడు శుభాధియోగమనీ అంటారు. ఈ యోగం పట్టినప్పుడు తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టడం, హోదా పెరగడం జరుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా కూడా హోదా పెరిగే అవకాశం ఉంటుంది. వీరి మాటకు, చేతకు విలువ ఉంటుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు అధికమవుతాయి. ప్రస్తుతం ఏడు రాశులకు ఈ యోగం పట్టింది. అవిః వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు. ఈ పరిస్థితి ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి ఎనిమిదవ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరి మాటకు, చేతకు విలువ పెరగడంతో పాటు, ప్రాభవం, ప్రాధాన్యం కూడా ఏర్పడతాయి. సామాజికంగా కూడా వీరిలో నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, ఇతరులను ఆదుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఏకంగా టీమ్ లీడర్ స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి ఏడు, ఎనిమిది స్థానాల్లో కుజ, బుధ, శుక్ర, రవి గ్రహాల సంచారం వల్ల ఉత్తమ స్థాయి అధియోగం ఏర్పడింది. దీని ఫలితంగా వృత్తి, ఉద్యోగాలలోనే కాకుండా, ఆర్థికంగా, సామాజి కంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవ కాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వితరణ, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలుకుబడి పెరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కుజ, బుధ, శుక్రులు, ఏడులో రవి, ఎనిమిదిలో శనీశ్వరుడి సంచారం వల్ల అత్యున్నత ఫలితాలను ఇవ్వగల అధియోగం ఏర్పడింది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరిగి సామాజిక హోదాలో కూడా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాల నిస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. నిరుద్యోగులకు అత్యధికంగా ఆఫర్లు అంది వస్తాయి.
  4. సింహం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి, ఏడవ స్థానంలో శనీశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల పాపాధియోగం ఏర్పడింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఎంత పోటీ ఉన్నా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఏదో విధంగా పైకి రావడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడు తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ ఉంటుంది.
  5. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో శనీశ్వరుడు, ఏడవ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా అధికారం చెలాయించడం జరుగుతుంది. అధికారులు ఈ రాశివారి మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. నిరుద్యోగులు అత్యధికంగా లాభపడడం జరుగుతుంది. అనుకోకుండా స్థిరాస్తి సమకూరుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
  6. తుల: ఈ రాశివారికి ఆరులో రాహువు, ఏడవ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల అధి యోగం పట్టింది. దీనివల్ల ప్రధానంగా మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడంతో పాటు, ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో అధికారాలు, ప్రత్యేక బాధ్యతలు పంచు కోవడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలివిడిగా తిరగడం వల్ల పలుకుబడి పెరుగుతుంది.
  7. వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. ఈ రాశివారికి సలహాలు, సూచనలతో అధికారులు ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. పట్టుదలగా వ్యవహరించి అనుకున్నవి సాధించే అవకాశం ఉంది. సేవా, సామాజిక కార్యక్రమాల ద్వారా సామాజికంగా ప్రాధాన్యం, పలుకుబడి పెరుగుతాయి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ