Astrology: శుభ గ్రహంగా మారిన కేతువు.. ఆ రాశుల వారికి ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్..!

| Edited By: Janardhan Veluru

Aug 25, 2024 | 6:55 PM

పాప గ్రహం, వక్ర గ్రహం అయిన కేతువు ఆదివారం (ఆగస్టు 25) నుంచి దాదాపు నెలన్నర పాటు శుభ గ్రహంగా మారడం జరుగుతుంది. ప్రస్తుతం కన్యా రాశిలో సంచారం చేస్తున్న కేతువును శుభ గ్రహమైన శుక్రుడు 25 నుంచి కలవడం, ఈ కేతువు మీద కుజ, గురువుల దృష్టి కూడా పడడం వల్ల కేతువు లక్షణాలు సానుకూలంగా మారడం జరుగుతుంది.

Astrology: శుభ గ్రహంగా మారిన కేతువు.. ఆ రాశుల వారికి ఆదాయం భారీగా పెరిగే ఛాన్స్..!
Ketu Effects
Follow us on

పాప గ్రహం, వక్ర గ్రహం అయిన కేతువు ఆదివారం (ఆగస్టు 25) నుంచి దాదాపు నెలన్నర పాటు శుభ గ్రహంగా మారడం జరుగుతుంది. ప్రస్తుతం కన్యా రాశిలో సంచారం చేస్తున్న కేతువును శుభ గ్రహమైన శుక్రుడు 25 నుంచి కలవడం, ఈ కేతువు మీద కుజ, గురువుల దృష్టి కూడా పడడం వల్ల కేతువు లక్షణాలు సానుకూలంగా మారడం జరుగుతుంది. కేతువు శుభ గ్రహంగా మారినప్పుడు వైఫల్యాలు, అపజయాల స్థానంలో సాఫల్యాలు, విజయాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నంలోనైనా ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆదాయం పెరగడానికి, అధికారం దక్కడానికి మార్గం సుగమం అవుతుంది. కేతువు లక్షణాలు మారుతున్నందువల్ల వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి.

  1. వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువుతో రాశ్యధిపతి శుక్రుడు కలవడం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో సహోద్యోగుల కంటే అన్ని విష యాల్లోనూ ముందుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు బాగా వెనుకబడతారు. అనేక ఆదాయ అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, కేతువులు కలవడం, వాటి మీద గురు, కుజుల దృష్టి పడడం వల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ అనుకూలంగా మారతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. పెండింగులో ఉన్న శుభ కార్యాలన్నీ వైభవంగా జరిగిపోతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సాను కూలపడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
  3. సింహం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శుక్ర, కేతువుల మీద లాభ స్థానం నుంచి కుజుడు, దశమ స్థానం నుంచి గురువు దృష్టి పడినందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు, పలుకుబడి బాగా పెరుగుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, కేతువులు కలవడం, దాన్ని రాశ్యధిపతి కుజుడు వీక్షించడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచడం జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
  5. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర, కేతువులు కలవడం, వాటిని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవ కాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం గడించడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాటపడతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
  6. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో కలిసిన శుక్ర, కేతువుల మీద గురువు దృష్టి పడినందువల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కలలో కూడా ఊహించని విజయాలు లభిస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు కూడా విదేశీ ఉద్యోగాలకు ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి