Gajalakshmi Rajayogam: ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం.. ఆ ఐదు రాశులవారికి వద్దన్నా డబ్బే..

|

May 01, 2023 | 10:05 AM

హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి మార్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో.. అదే ప్రాధాన్యత గ్రహణానికి కూడా ఉంది. ఇప్పటికే ఏర్పడిన గజలక్ష్మి యోగం.. రానున్న చంద్రగ్రహణం ప్రభావంతో ఈ ఐదు రాశులకు అదృష్టం కలిగి వస్తుందట. అంతేకాదు చేపట్టిన పనినిలో కలిసి వచ్చి కనకవర్షం కురిపించనుంది.

Gajalakshmi Rajayogam: ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం.. ఆ ఐదు రాశులవారికి వద్దన్నా డబ్బే..
Gajalakshmi Rajayogam
Follow us on

బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. వేద జ్యోతిష్యశాస్త్రంలో గజలక్ష్మి రాజయోగం అదృష్ట యోగంగా పరిగణిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి మార్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో.. అదే ప్రాధాన్యత గ్రహణానికి కూడా ఉంది. ఇప్పటికే ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం.. రానున్న చంద్రగ్రహణం ప్రభావంతో ఈ ఐదు రాశులకు అదృష్టం కలిగి వస్తుందట. అంతేకాదు చేపట్టిన పనినిలో కలిసి వచ్చి కనకవర్షం కురిపించనుంది.

గజలక్ష్మి రాజయోగం అంటే ఏమిటంటే.. 

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించిన సమయంలో అప్పటికే ఆ రాశిలో రాహువు ఉన్నాడు. రాహువు, గురువు ఏదైనా రాశిలో కలిస్తే ఏర్పడే యోగాన్ని గజలక్ష్మీ రాజయోగం అంటారు. . గజలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆనందం-అభివృద్ధి, ఐశ్వర్యం, ఆనందం-శాంతి ఉంటాయి. ఈ కలయిక వలన ఐదు రాశులకు ఆర్ధికంగా కలిసి  వస్తుందట. ఆకస్మిక ధన లాభం కలుగుతుందట.

ఇవి కూడా చదవండి

మిథునరాశి: ఈ రాశివారికి గజలక్ష్మి రాజయోగం అన్నీ శుభాలను కలిగిస్తుందట. ఈ రాశి వ్యక్తుల జాతకంలో పదకొండవ ఇంట్లో బృహస్పతి  ఉన్నాడు. దీంతో ఈ రాజయోగం వలన ఈ రాశివారు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అందుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:  ఈ రాశివారి జాతకంలో పడవ ఇంట గజలక్ష్మి యోగం ఏర్పడింది. దీంతో ఈ రాశి వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే. అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. విజయాన్ని సొంతం చేసుకుంటారు. చేసే పనిలో సక్సెస్ ఈ రాశివారి సొంతం

కన్య రాశి: ఈ రాశివారు జాతకంలో ఎనిమిదవ ఇంట్లో గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. పెళ్లికాని యువతి యువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు విజయానిన్ సొంతం చేసుకుంటారు.

తుల రాశి: ఈ రాశివారి జాతకంలో ఏడవ ఇంట గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. మంచి జీతం లభిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. పూర్తికుల ఆస్తి, డబ్బులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాలా సహాయం అందుకుంటారు.

మీన రాశి: ఈ రాశివారు రెండో ఇంట్లో గజలక్ష్మి యోగంఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయి. ఆర్ధికంగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).