June 2023 Horoscope: తల రాతలు మార్చే తారలు.. జూన్ మాసంలో వారికి బంగారమే.. మీ నక్షత్రానికి ఎలా ఉందంటే..?

| Edited By: Janardhan Veluru

Jun 02, 2023 | 6:00 PM

రాశుల మాదిరిగానే నక్షత్రాలు కూడా జీవితాలలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుట్టిన రాశికి బలం ఉన్నట్లే పుట్టిన నక్షత్రానికి కూడా బలం ఉంటుంది. అందువల్ల నక్షత్రాన్ని బట్టి కూడా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మారుతూ ఉంటాయి. ఏ గ్రహం ఏ నక్షత్రం మీద సంచారం చేస్తోంది అన్న దానిని బట్టి జాతక ఫలితాలలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ నక్షత్రాలకు జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

June 2023 Horoscope: తల రాతలు మార్చే తారలు.. జూన్ మాసంలో వారికి బంగారమే.. మీ నక్షత్రానికి ఎలా ఉందంటే..?
Astrology
Follow us on

June Horoscope: రాశుల మాదిరిగానే నక్షత్రాలు కూడా జీవితాలలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుట్టిన రాశికి బలం ఉన్నట్లే పుట్టిన నక్షత్రానికి కూడా బలం ఉంటుంది. అందువల్ల నక్షత్రాన్ని బట్టి కూడా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మారుతూ ఉంటాయి. ఏ గ్రహం ఏ నక్షత్రం మీద సంచారం చేస్తోంది అన్న దానిని బట్టి జాతక ఫలితాలలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ నక్షత్రాలకు జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయన్నది ఇక్కడ పరిశీలిద్దాం.

  1. అశ్విని, మఖ, మూల: ఈ మూడు నక్షత్రాలకు కేతువు అధిపతి. కేతువు ఏ రాశిలో సంచరిస్తున్నాడు అన్నది ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేతువు తులా రాశిలో సంచరించడం వల్ల ఈ మూడు నక్షత్రాల వారికి ఈ నెల ఫలితాలు శుభ ఫలితాలే కావడం జరుగుతుంది. ఉద్యోగంలో కుటుంబంలో సామరస్య, ప్రశాంత వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. ఒక విధమైన మనశ్శాంతి నెలకొంటుంది. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడం, ఇష్టమైన వారిని కలుసుకోవడం, ఇష్టమైన విందు భోజనాలను ఆరగించడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. సాధువుల సందర్శన, ఆలయాల సందర్శనకు అవకాశం ఉంది. ఏవైనా చిన్న సమస్యలు ఉన్నా, దోషాలు కనిపించినా దుర్గాదేవి స్తోత్రం లేదా శ్లోకం స్మరించడం మంచిది.
  2. భరణి, పుబ్బ, పూర్వాషాఢ: ఈ మూడు నక్షత్రాలు శుక్ర గ్రహానికి సంబంధిం చినవి. ప్రస్తుతం శుక్ర గ్రహం కర్కాటకంలో సంచారం ప్రారంభించింది. ఇక్కడ శుక్ర గ్రహానికి కుజ గ్రహంతో కలయిక సంభవించింది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు విజయం సాధిస్తారు. దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. దంపతుల మధ్య క్షణికావేశాలకు కొద్దిగా అవ కాశం ఉన్నప్పటికీ అవి వెను వెంటనే చల్లబడటం జరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదరటానికి అవకాశం ఉంది. హనీమూన్, విహార యాత్రలు, వినోద యాత్రలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వినటం, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభపరిణామాలు ఇప్పుడు అనుభవానికి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది.
  3. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ: ఈ నక్షత్రాలకు అధిపతి అయిన రవి గ్రహం జూన్ 16 వరకు వృషభరాశి లోను, ఆ తరువాత మిధున రాశి లోనూ సంచరించడం జరుగుతుంది. ఈ రాశులలో సంచరిస్తున్న కాలంలో ఈ మూడు నక్షత్రాల వారికి జీవితం సరదాగా, హాయిగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు లేదా ప్రత్యేక బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం అవసరం అవుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విహారయాత్రలకు అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం మీద మాత్రం ఒక కన్ను వేసి ఉండటం మంచిది.
  4. రోహిణి, హస్త, శ్రవణం: ఈ రాశులకు అధిపతి అయిన చంద్రగ్రహం ప్రస్తుతం అనుకూల సంచారమే చేస్తున్నందువల్ల ఆర్థికపరంగా బాగుండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు, ఇతరులకు ఆర్థిక సహాయం, మితిమీరిన ఔదార్యం వంటివి తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలలో విలువైన వస్తువులు విలువైన పత్రాలు పోగొట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. ఈ నెల మొదటి పక్షం కంటే రెండో పక్షంలో ఉద్యోగ పరంగా మెరుగైన రోజులకు అవకాశం ఉంది. ఆహార నియమాలను కఠినంగా పాటించడం మంచిది. అయితే కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాల వల్ల భవిష్యత్తులో సత్ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. మృగశిర, చిత్త, ధనిష్ట: ఈ నక్షత్రాల అధిపతి అయిన కుజ గ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచపడి ఉండటం పైగా శుక్ర గ్రహంతో కలిసి ఉండటం వల్ల విలాసాల మీద, అనవసర పరిచయాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసర ప్రయాణాలతో ఇబ్బంది పడటం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. అలవి కాని లక్ష్యాలను నిర్దేశించడం జరగవచ్చు. బంధువు లతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేసే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు దూసుకుపోతారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు శుభవార్త వింటారు.
  7. ఆర్ద్ర, స్వాతి, శతభిషం: ఈ మూడు నక్షత్రాలకు అధిపతి అయినటువంటి రాహు గ్రహం ప్రస్తుతం మేషరాశిలో సంచరిం చడం జరుగుతోంది. పైగా ఇక్కడ గురు గ్రహంతో కలయిక జరిగింది. ఫలితంగా ఈ మూడు నక్షత్రాల వారు ప్రయాణాల మూలంగా ప్రయోజనాలు పొందటం, పనిచేస్తున్న సంస్థలో అధికారం చేపట్టడం, ఉద్యోగ పరంగా కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మంచి గుర్తింపు తెచ్చుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్న వారు కూడా కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. జీవితంలో అనేక సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. విదేశీయానానికి కూడా అవకాశాలు ఉన్నాయి. యాంబిషన్ పెరుగుతుంది. ఏదో విధంగా సంపాదించాలనే, అభివృద్ధిలోకి రావాలనే తపన పెరుగుతుంది.
  8. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర: ఈ మూడు నక్షత్రాలకు అధిపతి అయినటువంటి గురు గ్రహం ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన మేష రాశిలో సంచరించడం వల్ల శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. చిన్న ప్రయత్నం కూడా విజయవంతం అయ్యి ఆర్థి కంగా ఉత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగు తుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరగ టంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా ఆశించిన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సంపాదన వృద్ధి చెందుతుంది. విదేశీ ప్రయాణాలకు, విదేశాలలో ఉద్యోగాలకు అవ కాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో కొనసాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నక్షత్రాల వారికి బాగా డిమాండ్ పెరుగు తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి.
  9. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర: ఈ నక్షత్రాలకు అధిపతి అయినటువంటి శనీశ్వరుడు తన స్వక్షేత్రమైన కుంభ రాశిలో బలంగా ఉన్నందువల్ల, తప్పకుండా శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయం పెరగటం, వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందటం వంటివి తప్పకుండా అనుభవానికి వస్తాయి. ఈ నక్షత్రాల వారి మాట సర్వత్రా చెల్లు బాటు అవుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పట్టవచ్చు. గతంలో నష్టపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం కూడా ఉంది. పిల్లలు పురోగతి చెందుతారు. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
  10. ఆశ్లేష, జ్యేష్ట, రేవతి: ఈ నక్షత్రాలకు అధిపతి అయిన బుధ గ్రహం తన ప్రాణ స్నేహితుడైన శుక్రుడి రాశిలో అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ నక్షత్రాల వారికి చాలావరకు సత్ఫలితాలే అనుభవానికి వస్తాయి. కోర్టు కేసులో విజయం సాధించడం, ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావడం, అన్నదమ్ములతో విభేదాలు తగ్గి సామరస్యం ఏర్పడటం, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరయటం వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. వీరి ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాలు మున్ముందు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నక్షత్రాల వారి సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ పరంగానే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలో వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఏ కొద్ది ప్రయత్నం చేసినా అది తప్పకుండా మంచి ఫలితం ఇస్తుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..