Job Astrology: ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఈ ఏడాది చివరి వరకు ఇలా..

| Edited By: Janardhan Veluru

Jul 28, 2024 | 7:01 PM

జ్యోతిష శాస్త్రం ప్రకారం పదవ స్థానాన్ని బట్టి ఉద్యోగ పరిస్థితి గురించి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ (దశమ) స్థానాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతి ఉంటుంది. ఒక్కో రాశికి ఒక్కో దశమాధిపతి (ఉద్యోగ స్థానాధిపతి) ఉండే అవకాశం ఉన్నందువల్ల ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మీ రాశి ఉద్యోగ స్థానాధిపతిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Job Astrology: ఆ రాశుల వారికి ఉద్యోగంలో పురోగతి.. ఈ ఏడాది చివరి వరకు ఇలా..
Job Astrology
Follow us on

జ్యోతిష శాస్త్రం ప్రకారం పదవ స్థానాన్ని బట్టి ఉద్యోగ పరిస్థితి గురించి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ (దశమ) స్థానాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా పురోగతి ఉంటుంది. ఒక్కో రాశికి ఒక్కో దశమాధిపతి (ఉద్యోగ స్థానాధిపతి) ఉండే అవకాశం ఉన్నందువల్ల ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మీ రాశి ఉద్యోగ స్థానాధిపతిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చిక, కుంభ రాశులకు దశమాధిపతి బాగా అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది చివరి వరకూ వీరి ఉద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉన్నదీ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశికి దశమాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో వక్రించి ఉన్నందువల్ల ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యానికి లోటుండదు. హోదాతో పాటు జీతభత్యాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలో మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా సాగిపోతాయి.
  2. వృషభం: ఈ రాశికి దశమాధిపతి అయిన శనీశ్వరుడు స్వస్థానంలో బలంగా సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఏడాది చివరి లోగా హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా నిలదొక్కుకుంటాయి. ఉద్యోగంలో పనిభారం, బాధ్యతల భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో భాగ్యాధిపతి గురువుతో కలిసి ఉన్నం దువల్ల ఉద్యోగపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అనేక ఆఫర్లు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా ఇతర కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
  4. తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితానికి భంగం ఉండదు. నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే భారీ జీతభత్యాలతో కూడిన మంచి ఉద్యో గంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో లేదా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఉంటుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి భాగ్య, దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. శీఘ్రగతిన అభివృద్ధి సాధించడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రతిభకు, నైపుణ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
  6. కుంభం: ఈ రాశికి దశమాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ధన, పంచమాధిపతి అయిన గురువుతో కలిసి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వానికి, శీఘ్ర పురోగతికి బాగా అవ కాశం ఉంది. పనితీరుతో, శక్తి సామర్థ్యాలతో అధికారులను ఆకట్టుకోవడం, ప్రత్యేక గుర్తింపు సంపా దించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా వృద్ధి చెందుతాయి. నిరుద్యో గుల ఆశలు, అంచనాలకు తగ్గట్టుగా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.