Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2025): మేష రాశి వారు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 06 September 2025

Edited By: Janardhan Veluru

Updated on: Sep 06, 2025 | 5:31 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2025): మేష రాశి వారు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యాపారాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరి స్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాలు, పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విజయవంతంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరి స్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు, షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. వాగ్దానాలు, హామీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యాలు, శ్రమాధికత్యత, తిప్పట కూడా తప్పకపోవచ్చు. కుటుంబ పరిస్థితులు అనుకూ లంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఊరట లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, ఆశ్లేష)

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల మీద బాగా శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. విద్యార్థులు కొద్ది కష్టంతో మంచి ఫలితాలు సాధిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏ రంగానికి చెందినవారికైనా సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆశించిన శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. బాధ్యతల విషయంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు పని చేస్తాయి. అనుకో కుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. సమయం. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులు విదేశాల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల వల్ల నష్టపోతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థుల్లో శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.