
దిన ఫలాలు (సెప్టెంబర్ 4, 2025): మేష రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు అధికమయ్యే అవకాశముంది. వృషభ రాశి వారి సమర్థతపై పై అధికారులకు నమ్మకం బాగా పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి ఇంటా బయటా బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మీ ఆలోచనలు, ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నా పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి.
ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో రాబడిపరంగా దూసుకుపోతారు. కొద్ది శ్రమతో అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశిం చిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభముంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
ఉద్యోగానికి సంబంధించిన ఏ విషయమైనా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగానే ఉన్న ప్పటికీ, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశిం చిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. మీ పని తీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరగడం వల్ల బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించవచ్చు. పిల్లల నుంచి శుభ వార్తలువింటారు.
ఉద్యోగాల్లో సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఇతరులకు ఉపయోగపడే జరిగే పనులు చేస్తారు.
ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆరోగ్య సమస్యలు బాగా తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ వృద్ధి వల్ల ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందు కుంటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది.
దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, కార్యక్రమాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. కుటుంబంతో దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.