AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 24 రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగ ప్రమోషన్లు, ఆదాయంలో వృద్ధి!

Horoscope Today (October 24, 2026): శనివారం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, ఆదాయం, ఆరోగ్య పరంగా అనుకూల ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరగడం నుంచి అధికారుల ప్రశంసలు అందుకోవడం వరకు కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి శనివారపు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

అక్టోబర్ 24 రాశి ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగ ప్రమోషన్లు, ఆదాయంలో వృద్ధి!
Rashi Phalalu 24 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 24, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 24, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృషభ రాశి వారు ఉద్యోగంలో సమర్థమైన పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొద్దిగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు, కొత్త ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థు లకు సమయం కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో సమర్థమైన పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. బంధు మిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధు వుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొద్దిగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించే సూచనలున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగు తాయి. కుటుంబపరంగా పురోగతికి అవకాశం ఉంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురో గతి ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరు ద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజన కంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల తలు ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరాభిమానాలను చూరగొంటారు. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహ కాలు లభిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యో గంలో చేరే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. స్నేహితులు, సన్ని హితులతో విందులో పాల్గొంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడ తారు. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లా సంగా పురోగతి చెందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం పెరిగి విశ్రాంతి కరువువుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగ మిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి కొంతవరకు బయటపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరు గుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నిరుద్యో గులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్నేహ సంబంధాలు అధికం అవుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల కారణంగా పదోన్నతి లభిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఒకటి రెండు ముఖ్యమైన వివాదాలు, సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. చేప ట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవ రికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

Follow Us