
దిన ఫలాలు (మే 29, 2026): మేష రాశి వారికి ఈ రోజు చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి సమయం. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో సమస్యల్ని చాలావరకు అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల్ని, ఒత్తిళ్లను అధిగమిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన దేవాలయాల్ని సందర్శిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపా రాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది.
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో సమస్యల్ని చాలావరకు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
గ్రహ బలం బాగున్నందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల్ని, ఒత్తిళ్లను అధిగమిస్తారు. అదనపు ఆదాయం కోసం కష్టపడతారు. అయితే, కొన్ని అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల వాతా వరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం చాలావరకు అన్యోన్యంగా సాగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉండవచ్చు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చుల్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో మీ శ్రమ, ప్రతిభ మరింతగా గుర్తింపు లభిస్తుంది. అధికారులు, సహోద్యోగులకు బాగా ఉపయోగపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లాభాలు పెంచుకుంటారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. సహాయం పొందిన స్నేహితులు ముఖం చాటేస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుంటారు. ఆదాయ పరిస్థితి ఆశించిన స్థాయిలో బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
సమయం బాగా అనుకూలంగా ఉంది. సరైన రీతిలో ఆర్థిక ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. ముఖ్యమైన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు.
ప్రధాన గ్రహాలు క్రమంగా అనుకూలంగా మారుతున్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని చక్కబెట్టుకోవడం మంచిది. గతంలో మీ నుంచి సహాయం పొందిన కొందరు మిత్రులు మొహం చాటేస్తారు. ఏ విషయంలోనూ ఎవరి మీదా ఆధారపడకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులోని ఒకటి రెండు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. మిత్రుల పైనా, కుటుంబ సభ్యుల పైనా ఖర్చు బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరిస్థితుల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కొందరు సన్నిహితుల వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబ పెద్దల సహకారంతో ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచి పోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. దైవ కార్యాల మీద బాగా ఖర్చు పెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.