రాశిఫలాలు మే 20: ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!

Today Horoscope in Telugu: మే 20, 2026 బుధవారం రాశిఫలాల్లో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం పరంగా ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

రాశిఫలాలు మే 20: ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభాలు.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
Rashifal In Telugu 20 May 2026

Edited By:

Updated on: May 20, 2026 | 5:45 AM

దిన ఫలాలు (మే 20, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. మిత్రులతో కలిసి వినోద యాత్రలో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో దూసుకుపోతారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. గృహం కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా ప్రశాంతంగా, ఆశించిన విధంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని చిక్కులు, సమస్యలు తొలగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ముందుకు సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థికంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు. ఖర్చులు పెరుగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ, చివరికి సంతృప్తి కరంగా వాటిని పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడ తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కానుకగా అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకువెడతారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. వివాహ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రుణ సమస్యలు తగ్గి ఊరట చెందుతారు. కుటుంబంలో దైవ కార్యం తలపెడతారు. పిల్లల్లో ఒకరికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తప్పకుండా ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో తొందరపడి వ్యవహరించడం మంచిది కాదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. సోదర వర్గంతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. ప్రయాణాల్లో తొందరపాటు ధోరణి పనికి రాదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో మాట పట్టింపులు, అపార్థాలు తొలగిపోతాయి. వ్యక్తిగత పనులు, కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందు తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్ని వాయిదా వేయడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యానికి అవకాశం ఉంది. కొందరు మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పని భారం బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తుల పరంగా ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించు కుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us