మే 15 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆదాయం, అదృష్టం కలిసొచ్చే రోజు..!
Horoscope Today: మే 15, 2026 శుక్రవారం రాశిఫలాల్లో మేష, వృషభ, మిథున రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికారుల ప్రోత్సాహం, గుర్తింపు, బాధ్యతల్లో అనుకూల మార్పులతో పాటు 12 రాశుల వారికి ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో ఎలా ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి.

దిన ఫలాలు (మే 15, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. బాధ్యతల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రోత్సాహకాలు లభిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గుతాయి. బంధుమిత్రులతో ఒకటి రెండు సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారుల్లో కొత్త అవకాశాలు అందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. దైవ కార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు, సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. బాధ్యతల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెండింగ్ పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగు తుంది. బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. సహోద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా అధికారుల ఆదరణ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎక్కడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితం సరదాగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ధన యోగం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. గట్టి పట్టుదలతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. భాగస్వామ్య వ్యాపా రంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వస్తు వాహన లాభాలు పొందుతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రు లతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లల చదువులు సాఫీగా పురోగతి చెందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)