దినఫలాలు (10 మే 2026): ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మీ రాశికి ఇలా..
మే 10, 2026 ఆదివారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు కలిసి రానుండగా, వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి బాధ్యతలు పెరిగినా పురోగతి కనిపించనుండగా, ఇతర రాశుల వారికి కూడా ఉద్యోగం, ఆర్థికం, ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించనున్నాయి. 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు (మే 10, 2026): మేష రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. మిథునరాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక బాధ్యతల వల్ల శ్రమాధిక్యత ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెంచే ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని బాగా తగ్గించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలకు అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో బాగా దూసుకుపోతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయానికి ఏమాత్రం లోటుం డదు. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి బాగా ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారుల అండతో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలకు కొరత ఉండదు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజన కంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుం టాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికీ ఆర్థికంగా వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)