
దిన ఫలాలు (మార్చి 15, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొందరు బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.
ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే వృద్ధి చెందుతుందిది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలున్నా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజన కంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. హామీలకు ఇది సమయంకాదు.
ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యో గులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త లక్ష్యాలను చేపడతారు. కొందరు బంధు మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి పెద్దయెత్తున వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొనడం, ఆలయాలు సందర్శించడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపా రాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తికి సంబంధించి వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగ స్వామికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగతంగా చిన్నాచితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెడతారు. కొందరు బంధువులకు, సన్నిహితులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. తోబుట్టువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయపడతారు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. అనుకో కుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు.