
దిన ఫలాలు (జూలై 18, 2025): మేష రాశి వారికి ఆర్థిక లాభాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలోనూ, ధనాధిపతి శుక్రుడు ధన స్థానంలోనూ ఉన్నందువల్ల ఆర్థిక లాభాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. ఖర్చుల నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలయాల సందర్శన ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలోనూ, గురువు ధన స్థానంలోనూ కొనసాగుతున్నందు వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం నుంచి బయటపడ తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు.
రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో రవితో కలిసి ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో వేతనాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఈ రాశిలో రవి, బుదులు, ధన స్థానంలో కుజుడు, లాభ స్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల పట్టిం దల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మీరు పనిచేసే సంస్థకు మీ వల్ల లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
దశమ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందు వల్ల ఉద్యోగంలో అధి కార యోగం పట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. ఆదా యానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రాశ్యధిపతి రవి వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలువింటారు.
రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో రవితో కలిసి ఉండడం, భాగ్య స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
భాగ్య స్థానంలో గురువు, దశమ స్థానంలో రవి, బుధులు ఉన్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
భాగ్య స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తృతీయ స్థానంలో రాహువు వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు.
రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, పంచమాధిపతి శుక్రుడు పంచమంలో సంచారం వల్ల ఆదాయ పరంగానే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహక రంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
రాశ్యధిపతి శని ద్వితీయ స్థానంలో, శుక్రుడు చతుర్థంలో, గురువు పంచమంలో ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి రాజీ మార్గంలో తొలగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది.
రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో, రవి, బుధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.