Horoscope Today: ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రయాణాల్లో జాగ్రత్తలు

|

Jan 05, 2022 | 6:50 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రయాణాల్లో జాగ్రత్తలు
Horoscope Today
Follow us on

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 5 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల సహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఎవతోను గొడవలకు దిగకపోవడం మంచిది.

వృషభ రాశి:
కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల నుంచి సహాయం అందుకుంటారు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

మిథున రాశి:
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి:
ఈ రాశివారు తోటి వారితో జాగ్రత్తగా మెలగడం మంచిది. పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

సింహ రాశి:
అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శతృవులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకెళ్లడమే ఉత్తమం.

కన్య రాశి:
తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వహించాలి. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

తులరాశి:
ఆరోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి.

వృశ్చిక రాశి:
అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి:
పట్టుదలతో ముందుకెళ్లండి. చేపట్టిన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చుతారు. సమయానుకూలంగా ముందుకు వెళ్లాలి. పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు.

మకర రాశి:
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి:
ధైర్యంతో ముందుకెళ్లడం వల్ల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

మీన రాశి:
ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి:

Hanuman Chalisa: శనిప్రభావాన్ని నివారించే హనుమాన్ చాలీసా.. రోజుకు ఎన్నిసార్లు, ఎక్కడ పఠించాలంటే..

Chanakya Niti: ఈ ఐదు లక్షణాలు కలిసిన స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడే అంటున్న చాణక్య..