Horoscope Today: వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయమిది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (January 21, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారు పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. బంధువర్గంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మిథున రాశి వారు అదనపు ఆదాయానికి ప్రయత్నించడం మంచిది. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయమిది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Telugu Rashifal 21 January 2026

Edited By:

Updated on: Jan 21, 2026 | 5:31 AM

దిన ఫలాలు (జనవరి 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంండే అవకాశం ఉంది. వృషభ రాశి వారు పెళ్లి ప్రయత్నాలు చేపడితే.. బంధువర్గంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మిథున రాశి వారు అదనపు ఆదాయానికి ప్రయత్నించడం మంచిది.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి రంగాలవారికి ఆదాయం బాగా పెరిగే అవకాశముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. బంధువర్గంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ రోజు అదనపు ఆదాయానికి ప్రయత్నించడం మంచిది. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు బాగా మారిపోయే అవకాశం ఉంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. కొన్ని ఆర్థిక సమ స్యలు, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన కొత్త కార్యక్రమాలు చేపడతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునేవారి సంఖ్య ఎక్కువవుతుంది. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో అనుకూలత పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, హ్యాపీగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తవింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అధికారుల వేధింపులు, ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంది. బంధువుల శుభ కార్యాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెడతారు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ప్రయాణాల్లో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మరింత శ్రద్ద పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలోనే కాక, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదర వర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి అధికారులు ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అన్నదమ్ములు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం పెంచుకోవడం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయం ఇది. వ్యాపార కార్యకలాపాలు బిజీగా సాగిపోతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. కొందరు మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అదనపు ఆదాయానికి ప్రయత్నించడం మంచిది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలను పూర్తి చేయడం మీద దృష్టి పెడతారు. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒకటి రెండు సమస్యలుండే అవకాశం ఉంది. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు న‌ష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి జీవితంలో ఉన్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందుతారు. ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.