మేష రాశి..
ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడుతారు.
వృషభ రాశి..
ఈరోజు వీరు నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మానసిక ఆనందం పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు.
మిథున రాశి..
ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. రుణప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది.వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు నూతన గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి.కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహరాశి..
ఈరోజు వీరికి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనవసర భయం ఆవహిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది.
కన్య రాశి..
ఈరోజు వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం.
తుల రాశి..
ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరు ళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.
మకర రాశి..
ఈరోజు వీరు మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.
కుంభరాశి.
ఈరోజు స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.
మీన రాశి..
ఈరోజు వీరు ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి.