AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారు అధిక ధన వ్యయం చేసే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

చాలా మంది తమ జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ఆధారంగా  దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తారు. వెంటనే రాశిఫలాలు వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 25వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈ రాశివారు అధిక ధన వ్యయం చేసే అవకాశం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Nov 25, 2022 | 6:25 AM

Share

Horoscope Today (25-11-2022): రోజు జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో చాలా మంది తమ జన్మ నక్షత్ర, నామ నక్షత్ర ఆధారంగా  దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తారు. వెంటనే రాశిఫలాలు వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో (నవంబర్ 25వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ఆయా రంగాల్లోని వారు చేపట్టిన పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రణాళికలతో  చేసే పనులు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ఓర్పుతో సాగితే ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. సంతోషాన్ని కలిగించే వార్త వింటారు. శుభకాలం. కీలకమైన పనుల విషయంలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి కీలక  పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అప్పుల బాధలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని జయించి  ముందుకు సాగుతారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక విషయాల్లో అలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అధిక శ్రమ పడాల్సి ఉంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన ముఖ్యమైన పనులు మీరు అనుకున్న సమయానికి పూర్తి  చేస్తారు. అనవసర ధనవ్యయం చేసే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల సహకారంతో ఆశించిన ఫలితాలను అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో కుటుంబ సభ్యుల సలహాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని అధిగమించి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయంలో ఆర్థిక సాయం లభిస్తుంది. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంగా  కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారికీ ఆర్ధికంగా శుభకాలం.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కుటుంబ సభ్యుల బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తారు. ఆత్మవిశ్వాసం  కలిగించే శుభవార్త వింటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అవసరానికి డబ్బులు చేతికి అందుకుంటారు.  మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఉద్యోగంలో శుభఫలితాలను అందుకుంటారు. చేపట్టే పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుని ఆర్ధిక లాభాలను పొందుతారు.  బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్