Horoscope Today: ఈ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

|

Nov 20, 2022 | 6:43 AM

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాలతోనే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు.

Horoscope Today: ఈ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope
Follow us on

జ్యోతిష్యం, రాశి ఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. వారంతా రాశి ఫలాలతోనే రోజును ప్రారంభిస్తారు. వాటి ద్వారానే కార్యక్రమాలను మెదలు పెట్టడం లేదా పనులను వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తారు. మరి ఈరోజు (ఆదివారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం: ఈ రాశి వారికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన ఆర్థిక సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు కష్టపడతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి..

వృషభం: ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పకీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.

ఇవి కూడా చదవండి

మిథునం: వీరికి అన్ని రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అధిగమించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిది.

కర్కాటకం: ఈ రాశి వారికి శుభకాలం.. చేపట్టిన పనుల గురించి ఓ శుభవార్త వింటారు. అనుకూల పరిస్థితుల్లో ముందుకు సాగుతారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

సింహం: కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేసి.. విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

కన్య: ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది.

తుల: చేపట్టే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. తీసుకునే నిర్ణయాలపై బంధుమిత్రులతో చర్చించండి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చికం: ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొందరితో అప్రమత్తంగా ఉండటం మంచిది.

ధనుస్సు: ఈ రాశివారికి అనుకూల పరిస్థితులున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరిగే అవకాశముంది. కోపతాపాలకు దూరంగా ఉండాలి.

మకరం: చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.. అనవసర విషయాలకు దూరంగా ఉండండి.

కుంభం: ఆటంకాలు ఎదురైనప్పటికీ.. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వేరే వారి విషయాల్లో తలదూర్చకండి.. తీసుకునే నిర్ణయాలతో సమాజంలో మరింత గౌరవం పెరుగుతుంది.

మీనం: ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

నోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..