మేష రాశి..
ఈరోజు వీరు కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. రుణబాధలు తొలగిపోతాయి. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరు మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథున రాశి..
ఈరోజు వీరికిఅనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి.
సింహ రాశి…
ఈరోజు వీరికి కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.
కన్య రాశి..
ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల రాశి..
ఈ రోజు వీరు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. మనస్సు చంచలంగా ఉంటుంది.అనారోగ్య బాధలు ఉంటాయి..
వృశ్చిక రాశి.
ఈరోజు వీరు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. శతృబాధలు తొలగిపోతాయి.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి అఅశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
మకర రాశి..
ఈరోజు వీరు మానసిక ఆందోళన అధిమవుతుంది. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
కుంభరాశి..
ఈరోజు వీరు చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.
మీన రాశి..
ఈ రోజు వీరు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.