AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వ్యాపారస్తులు అనూహ్యంగా లాభాలను ఆర్జించే అవకాశం..

మంచి చెడుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 5వ తేదీ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వ్యాపారస్తులు అనూహ్యంగా లాభాలను ఆర్జించే అవకాశం..
Horoscope Today
Surya Kala
|

Updated on: Jul 05, 2022 | 6:11 AM

Share

Horoscope Today (05-07-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. జాతక ఫలాలు తెలుసుకోవాలని చాలా మంది భావిస్తారు. మంచి చెడుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో    తమ దినఫలాలు ( Daily Horoscope)పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 5వతేదీ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రారంభించనున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి మొదలు పెట్టె ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాలను వాయిదావేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు సంతోషంగా గడుపుతారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలను కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనుల విషయంలో స్థిర నిర్ణయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది.  ఆర్ధికంగా ఖర్చు పెరగకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలి. సకాలంలో పనులు పూర్తి చేసి ప్రశంసలను అందుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశి ఆయా రంగాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతరులను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కొత్త స్నేహితులు లభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో అధిక లాభాలను సొంతం చేసుకుంటారు .

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారంలో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. శుభ వార్త వింటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక ఋణం చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముందుస్తు ప్రణాళికలతో పనులు చేపట్టాల్సి ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసిక ధైర్యంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అధిక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇతరుల సహకారంతో సమస్యలు తీరతాయి.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సొంతం చేసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?