Horoscope Today (29-07-2022): నేటికీ రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా శుభకార్యాలు ఇలా ఏ విషయంలోనైనా రోజులో తమ జాతకం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. జాతకాలూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూలై 29వ తేదీ) శుక్రవారం ఏ రాశివారు (Rashi Phalalu) ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటారో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. అధికారులతో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలగాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషాన్ని ఇచ్చే వార్త వింటారు. ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు మానసికంగా సంతోషాన్ని కలిగిస్తాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చు చేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి అడుగువేయాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి కీలక పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాలానుగుణంగా చేపట్టిన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. శుభఫలితాలను అందుకుంటారు. బంధువులతో మేలు జరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా సత్పలితాలను ఇస్తాయి. ప్రతిభతో ఇతరులను మెప్పిస్తారు. బంధు, మిత్రులను కలుపుకొని ముందుకు సాగడం వలన మేలు కలుగుతుంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విషయంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఇతరుల సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో బద్ధకించకండి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు. కాలం అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకెళ్తారు. పని తీరుకుతగిన ప్రశంసలను పొందుతారు.అందరినీ కలుపుకొని పోవడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)