Horoscope Today: వీరికి దైవబలం నిండుగా ఉంటుంది.. శుభవార్త వింటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

|

Jul 18, 2022 | 6:29 AM

Horoscope Today (18-07-2022): రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని ఆరా తీస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు మరీ చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు.

Horoscope Today: వీరికి దైవబలం నిండుగా ఉంటుంది.. శుభవార్త వింటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope
Follow us on

Horoscope Today (18-07-2022): శుభకార్యాలు జరపాలన్నా, మంచి పనులు మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా చాలామంది మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అంతెందుకు రోజులో ఏ పని మొదలుపెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని ఆరా తీస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు మరీ చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 18(సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

శ్రమయేవ జయతే అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. చేపట్టిన రంగాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. గొడవలు, వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. వేళకు నిద్రాహారాలు పాటించాలి. దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేస్తే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

వృషభం

ఈ రాశివారికి అనుకూల పరిస్థితులున్నాయి. కీలక, ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. నూతన వస్తువులను కొంటారు. కీలక విషయాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. పరమేశ్వరుడిని సందర్శిస్తే మంచిది.

మిథునం

వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. వీరికి దైవబలం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి దేవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

కర్కాటకం

చేపట్టే పనుల్లో స్థిరంగా వ్యవహరించాలి. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. బంధువులు, ఇతరుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.

సింహం

కొన్ని విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా ముందుకుసాగాలి. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించడం మంచిది. సూర్య స్తుతి వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.

కన్య

చేపట్టిన రంగాల్లో సానుకూలఫలితాలు అందుకుంటారు. ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని ఆర్జిస్తారు. కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేకూరుస్తుంది.

తుల

అనుకున్న పనులను అనుకున్నట్టు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు దక్కుతాయి. ఇష్ట దైవారాదన మాత్రం మానవద్దు.

వృశ్చికం

కీలక వ్యవహారాల్లో ఆప్తుల సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అబిప్రాయబేధాలు, తగాదాలు తలెత్తుతాయి. దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల శుభం కలుగుతుంది.

ధనస్సు

కీలక పనులు ఆలస్యమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన గుర్తింపు దక్కదు. ఇందుకోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు.

మకరం

వృత్తి ఉద్యోగ వ్యాపార తదితర రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. పై అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో చేయని పొరపాటుకు నిందలు పడాల్సి రావచ్చు. దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి జరుగుతుంది.

కుంభం

ఈ రాశివారికి శుభఘడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలతో సానుకూల ఫలితాలను సాధిస్తారు. కీలక పనుల్లో ముందడుగు వేస్తారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. చంద్రధ్యానం శుభప్రదం.

మీనం

సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించి ఒక శుభ వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యంలో విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..