మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సంపాదన సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలకు విజయాలు లభిస్తాయి. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. అను కోకుండా సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పెద్దల జోక్యంతో తోబుట్టువులు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా చక్కబడు తుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సహాయం విషయంలో ఎవరికీ వాగ్దానం చేయ వద్దు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. ఆస్తి వివాదం ఒకటి బంధువుల సహాయంతో ఒక కొలిక్కి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాలలో మంచి ఆర్థిక ప్రయోజనాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అధికారుల నుంచి మంచి గుర్తింపు ఉంటుంది. కుటుంబ వ్యవహా రాలలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. తోబుట్టువులతో చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. నిరుద్యో గులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఎవరికీ హామీలు ఉండకపోవటం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి సానుకూలంగా పరి ష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇతరుల వివాదాల్లో తల దూర్చకపోవడం మంచిది. చిన్న వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆందోళన చెందటం మంచిది కాదు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బాగానే ముందుకు వెళతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. అధికారులు వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి యధాతధంగా కొనసాగుతుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబ వాతావరణం సానుకూలంగా, సామ రస్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి నిపుణులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అదనపు సంపాదన కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు ప్రయోజనం కలిగే పనులు చేపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తుల్లో ఉన్న వారు పురోగతి సాధిస్తారు. ఊహించని విధంగా ఆస్తి విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. స్వయం ఉపాధి వారు, చిన్న వ్యాపా రులు బాగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. తోబుట్టువులకు ఆర్థికంగా సహాయపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొందరు స్నేహితులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. నగర ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకరి ద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేపడతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. కొందరు బంధువులు తప్పుదారి పట్టించే అవ కాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో వ్యక్తిగత పను లను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాం తంగా సాగిపోతుంది. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఒక ముఖ్యమైన స్నేహితుడి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.