Horoscope Today: ఈ రాశి వారికి చేపట్టే పనులలో ఆటంకాలు.. ఈ విధంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు..!

|

Sep 29, 2021 | 4:27 AM

Horoscope Today: చాలా మంది వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి అంచనా వేస్తూ రోజువారీ రాశి ఫలాలను చూస్తుంటారు. ఈ రోజు అంటే సెప్టెంబరు 29 బుధవారం నాడు..

Horoscope Today: ఈ రాశి వారికి చేపట్టే పనులలో ఆటంకాలు.. ఈ విధంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు..!
Follow us on

Horoscope Today: చాలా మంది వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి అంచనా వేస్తూ రోజువారీ రాశి ఫలాలను చూస్తుంటారు. ఈ రోజు అంటే సెప్టెంబరు 29 బుధవారం నాడు చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. అలాగే ఈ రాశిలో చంద్రుడు కదులుతుండటం వల్ల ఈ మిథున రాశి వారు పురోగతి సాధిస్తారు. అంతేకాకుండా మిగిలిన రాశుల వారికి కూడా విభిన్న ప్రభావాలు ఉంటాయి. కుంభ రాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయాలు తీసుకునేముందు చాలా తెలివిగా, సంయమనంతో వ్యవహరించాలి. మరి మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి.

వృషభ రాశి:

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడం మంచి ఫలితలు వస్తాయి. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి.

మిథున రాశి:

రాజకీయ నాయకులకు మంచి జరుగుతుంది. వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సలహాలు ఎంతో అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం.

కర్కాటక రాశి:

చేపట్టిన పనులన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇతరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. శుభవార్తలు వింటారు. కొన్ని విషయాలు మనోధైర్యాన్ని పెంచుతాయి.

సింహ రాశి:

మంచి అవగాహనతో పనులు చేపడితే మంచి ఫలితాలు ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గిట్టని వారితో దూరంగా ఉండటం మేలు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య రాశి:

ఆలోచనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.

తుల రాశి:

చేపట్టే పనులలో ముందు చూపు ఎంతో అవసరం. ఇతరుల నుంచి బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:

పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. అనుకున్న పనులు జరుగుతాయి. తోటి వారి సహాయంతో మంచి ఫలితాలు సాధిస్తారు.

ధనుస్సు రాశి:

కీలక వ్యవహారాలలో ఆలోచనతో ముందుకు వెళ్లాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి:

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మబలంతో ముందుకు సాగితే అధికమిస్తారు. కొన్ని విషయాలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఎక్కువ శ్రమ ఉంటుంది.

కుంభ రాశి:

ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. కొన్ని కీలకమైన పనులు చేపట్టగలుగుతారు. ఓ వార్త మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తుంది.  తెలివిగా, ధైర్యంతో ముందుకెళితే మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి:

చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహాయంతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

ఇవీ కూడా చదవండి:

Tumakuru Matt: తుమకూరు మఠానికి 13 ఏళ్ల బాలుడు మఠాధిపతిగా ఎంపిక.. చదువుతూనే బాధ్యతలు నిర్వహిస్తాడన్న పెద్దలు

హిందూపురాణాల్లో వీరులు ఎన్ని రకాలో తెలుసా! అతిరథ మహారథులు ఏకకాలంలో ఎంతమందితో యుద్ధం చేస్తారంటే..