Horoscope Today: ఈరాశివారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (March 24 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరాశివారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2022 | 6:01 AM

Horoscope Today (March 24 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 24వ తేదీ ) గురువారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషరాశి

ఈరాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనవసర ఖర్చుల విషయంలో దృష్టి సారించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లక్ష్మీగణపతిని పూజిస్తే మంచి కలుగుతుంది.

వృషభరాశి

శత్రువులపై పైచేయి సాధిస్తారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మరింత మేలు చేకూరుతుంది.

మిథునరాశి

దైవబలం తోడుగా ఉంటుంది. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు మంచి కాలం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవతలను ప్రార్థించడం వల్ల శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి

కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఈ విషయంపై దృష్టిసారించాలి. చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శివుడిని ప్రార్థించడం శుభప్రదం

సింహరాశి ఈరాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సహకారం ఉంటుంది.

కన్య రాశి

విందులు, వినోదాలు తదితర శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ముందుచూపుతో వ్యవహరించడం వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మరింత మేలు కలుగుతుంది.

తుల రాశి

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు పాటించాలి. శ్రీవిష్ణు ఆరాధన ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

వృశ్చిక రాశి

ఉద్యోగంలో మంచి ఫలితాలు అందుఉకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేకూరుస్తాయి. అయితే కొన్ని సంఘటనలు మనసుకు ఇబ్బంది కలిగిస్తాయి. దుర్గాస్తుతి చదవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.

ధనుస్సురాశి

ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాలి. బలమైన పోషకాహారం, విశ్రాంతి అవసరమవుతాయి. ప్రయాణాల్లో కాస్త ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల శుభం కలుగుతుంది.

మకరరాశి

మంచి ఫలితాలు అందుకుంటారు. జీవితానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన ఫలితం దక్కుతుంది.

కుంభ రాశి

వీరు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు ముందుకు వస్తారు. అయితే శత్రువులు, విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు కలుగుతుంది.

మీన రాశి

కీలక వ్యవహారాల్లో కుటుంబీకులు, బంధువుల సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వరుడిని దర్శించుకోవడం వల్ల మంచి కలుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.) Also Read:Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

COVID Vaccination: వేగవంతంగా వ్యాక్సినేషన్.. కోవిడ్ రక్కసికి చెక్ పెట్టిన మోడీ సర్కార్ వ్యూహం..

Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం.. మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు..