Horoscope Today (30-06-2022): ఏ పని మొదలు పెట్టాలన్నా, శుభాకార్యాలు జరపాలన్న మంచి ముహూర్తాలు తప్పకుండా చూస్తారు.. తమకు అన్ని విధాలా అనుకూలమైతైనే ఆ పనులు మొదలపెడతారు. ఇక మనలో చాలామంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జూన్ 30 (గురువారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
మేషం
కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారం ఉంటుంది. అయితే పొదుపు పాటించాల్సిన అవసరముంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం ఉత్తమం. శివనామాన్ని జపిస్తే శుభం కలుగుతుంది.
వృషభం
అనుకున్న ప్రణాళికలను అమలు చేయాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శత్రువులకు దూరంగా ఉండడం ఉత్తమం. వృథా ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. దుర్గాదేవిని పూజిస్తే మేలు జరుగుతుంది.
మిథునం
కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి ఈ రాశివారికి శుఘఘడియలు నడుస్తున్నాయి. ఇష్టదైవారాధన మాత్రం మరవకూడదు.
కర్కాటకం
కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
సింహం
శత్రువులపై పై చేయి సాధిస్తారు. చేపట్టిన రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
కన్య
ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని గ్రహించాలి. శివనామాన్ని పఠించడం వల్ల మేలు చేకూరుతుంది.
తుల
ఈరాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబీకులు, బంధువులను కలుపుకొనిపోవాలి. మనోబలం, ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వరుడిని పూజిస్తే మంచి కలుగుతుంది.
వృశ్చికం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరస్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలను పొందగలుగుతారు.
ధనస్సు
వీరు ఒక శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందులు,వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన వల్ల శుభం కలుగుతుంది.
మకరం
ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యమైన, కీలకమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
కుంభం
ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేకూరుస్తుంది.
మీనం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సానుకూల ఫలితాలు పొందడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురికావద్దు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి జరుగుతుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..