AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Daily Horoscope in Telugu (April 19, 2026) మేషం నుంచి మీనం వరకు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఆదాయం బాగుండగా, వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో శుభవార్తలు లభిస్తాయి. మిథున రాశి వారికి పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కుటుంబ, ప్రేమ, విద్య, ఆరోగ్య రంగాల్లో రాశి వారీగా ఫలితాలు మారుతూ ఉండనున్నాయి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 19 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయానికి లోటుండదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరినీగుడ్డిగా నమ్మవద్దు. ఉచిత సహాయాలు, దానధర్మాలకు స్వస్తి చెప్పడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఏ పని తలపెట్టినా సంతృప్తి కరంగా పూర్తవుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో చదువులు, పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావచ్చు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. అధికారులతో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. గట్టి పట్టుదలతో కొన్నిముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశముంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సరదాగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఇతర ఉద్యోగులతో ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. రాబడికి ఏమాత్రం లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలకు అవకాశం ఉంది. ఇంటా బయటా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. కొన్ని అత్యవసర వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరి స్థితి మెరుగ్గానే ఉంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. ఎవరికీ వాగ్దానాలూ చేయవద్దు. విద్యా ర్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు చోటు చేసుకోవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. చదువుల విషయంలో పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆస్తి వ్యవహారానికి సంబంధించి తండ్రి నుంచి శుభవార్త వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

గ్రహ బలం ఏమంత అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెడతారు. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

Follow Us